‘ఆర్.ఆర్.ఆర్’ విడుదల ఎప్పుడు? ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎందుకంటే సాధారణంగా రాజమౌళి సినిమాలు ఆలస్యం అవుతుంటాయి. చెప్పిన సమయానికి ఎప్పుడూ రావు. అక్టోబరు 13న ఆర్.ఆర్.ఆర్ వస్తుందని ఎప్పుడో చెప్పేశారు. అయితే… ఈ డేట్ మారే అవకాశాలు ఉన్నాయని, అక్టోబరు 13న ఆర్.ఆర్.ఆర్ రాదని అభిమానులు ఫిక్సయిపోయారు. ఎందుకంటే… కరోనా పరిస్థితులు అలా ఉన్నాయి.కరోనా వల్ల షూటింగులన్నీ ఆగిపోయాయి. విడుదలలు వాయిదా పడ్డాయి. ఆ లిస్టులో ఆర్.ఆర్.ఆర్ కూడా ఉంటుందని జనాల నమ్మకం. కానీ.. రాజమౌళి మాత్రం అక్టోబర 13కే ఫిక్సయిపోయారు. తాజాగా ఈ రోజు ఆర్.ఆర్.ఆర్ నుంచి మరో కొత్త పోస్టర్ వచ్చింది. ఎన్టీఆర్, చరణ్‌లు ఒకే బైక్ పై షికారు చేస్తున్న ఫొటో అది. ఇప్పటి వరకూ అల్లూరి, కొమరం పాత్రల మధ్యన వైరం చూపించిన రాజమౌళి, వాళ్లలోనే స్నేహాన్ని ఎలివేట్ చేసిన పోస్టర్ అది. ఈ పోస్టర్ పై కూడా అక్టోబరు 13నే విడుదల అని ఉంది. సో.. రాజమౌళి ఈ విషయంలో క్లారిటీగానే ఉన్నాడన్నమాట. ఆర్.ఆర్.ఆర్ టాకీ ఎప్పుడో పూర్తయిపోయిందని, రెండు పాటలు మాత్రమే బాకీ అని నిర్మాత ప్రకటించారు. ఆలెక్కన చూస్తే రెండు పాటల్నీ పూర్తి చేయడానికి పెద్దగా సమయం పట్టదు. అంటే.. అక్టోబర్ 13న టాలీవుడ్ కి పెద పండగ రాబోతోందన్నమాట.