2020లో సినిమా సంబరాలు పెద్దగా లేవు. కొత్త సినిమా కబుర్లు, టీజర్లు, గోల… బాగా తగ్గిపోయింది. అయితే 2021 కథ వేరేలా ఉండబోతోంది. కొత్త సినిమాల హడావుడి ఇప్పటికే మొదలైపోయింది. సంక్రాంతికి సినీ సంబరాలు మామూలే. 2021లో పెద్ద సినిమాలు రాబోతున్నాయి. అందులో RRR ఒకటి. రాజమౌళి చేస్తున్న మల్టీస్టారర్ ఇది. అంచనాలు భారీగా ఉన్నాయి. వచ్చే దసరాకి విడుదల చేయాలన్నది ప్లాన్.
ఇప్పుడు టీజర్ కూడా సిద్ధం చేస్తున్నారని టాక్. రిపబ్లిక్‌డే సందర్భంగా ఓ చిన్న టీజర్ లేదా, పోస్టర్ విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకూ అల్లూరి, కొమరం భీమ్ పాత్రల్ని పరిచయం చేస్తూ రెండు టీజర్లని విడుదల చేశారు. ఇద్దర్నీ కలిపి చూపించిన టీజర్, పోస్టర్ లేదు. రిపబ్లిక్ డేకి.. అది చూసే ఛాన్సుంది. సంక్రాంతికి RRR పోస్టర్ విడుదల చేద్దామనుకున్నారు. కానీ.. రిపబ్లిక్ డేకి వాయిదా పడింది. దేశభక్తి నేపథ్యంలో సాగే సినిమా RRR. అందుకే జనవరి 26నే అందుకు సరైన వేదిక అని భావిస్తున్నాడు రాజమౌళి.
చరణ్ రాక ఎప్పుడు?
రామ్ చరణ్‌కి కోవిడ్ సోకిన సంగతి తెలిసిందే. ఆయన ప్రస్తుతం హౌం క్వారెంటైన్లో ఉన్నాడు. జనవరి 4 నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభం కాబోతోంది. ఈ షెడ్యూల్లో చరణ్‌పై కొన్ని సన్నివేశాలు తెరకెక్కించాలన్నది ప్లాన్. జనవరి 7 నుంచి చరణ్ సెట్లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. ఈలోగా ఆయనకు నెగిటీవ్ వస్తుందన్నది చిత్రబృందం నమ్మకం. అంతగా కాకపోతే సంక్రాంతి తరవాతే… కొత్త షెడ్యూల్ ని ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నారు.