రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్. `ఆర్.ఆర్.ఆర్`. రామ్ చరణ్ – ఎన్టీఆర్ కథానాయకులు. అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ కనిపిస్తున్నాడు. సీత గా అలియాభట్ నటిస్తోంది. ఈరోజు అలియా పుట్టిన రోజు. ఈ సందర్భంగా.. ఆర్.ఆర్.ఆర్ నుంచి సీతగా అలియా భట్ లుక్‌ని చిత్రబృందం విడుదల చేసింది.
సీత పేరుకు తగ్గట్టుగానే కట్టూ, బొట్టులో సంప్రదాయం కనిపిస్తోంది. అలియా సీత పాత్రలో అల్లుకుపోయిందన్న విషయం ఫస్ట్ లుక్‌తోనే అర్థం అవుతోంది. అయితే.. ఆ కళ్లలో ఏదో తెలియని బాధ. సీతగా విరహాన్నీ, వియోగాన్నీ అనుభవిస్తున్న చిత్రంలా తోస్తోంది. అలియాకు ఇదే తొలి దక్షిణాది చిత్రం.రాజమౌళి సినిమా అందులోనూ, చరణ్ హీరో. ఇంతకంటే అలియాకు మంచి ఆరంభం దొరకదేమో..? రాజమౌళి సినిమాల్లో హీరోలకే కాదు, హీరోయిన్లకూ శక్తిమంతమైన పాత్రలు పడతాయి. మరి అలియాని జక్కన్న ఎలా వాడుకున్నాడో చూడాలి.