గత ఎన్నికల్లో వైసీపీ తరఫున ఎంపీగా గెలుపొంది కొన్నాళ్లకే తిరుగుబాటు చేసిన రఘురామకృష్ణరాజు ఈ ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. వైసీపీ రెబల్ ఎంపీగా ఆయన తిరుగుబాటు టీడీపీకి నాడు మంచి స్టఫ్ అందించింది. జగన్ అంటేనే ఒంటికాలి మీద లేచే రఘురామ ఈసారి అసెంబ్లీలో జగన్ ను ఎలా ఇరుకున పెడుతారో అనేది పొలిటికల్ సర్కిల్లో అత్యంత ఆసక్తికర అంశంగా మారింది.
వైసీపీ హయాంలో టార్గెట్ చేసి మరీ వేధించడంతో జగన్ పై రఘురామ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. సమయం వచ్చినప్పుడు తేల్చుకుంటానని స్పష్టం చేయడంతో రఘురామ- జగన్ ల మధ్య జరిగే అసెంబ్లీ వార్ సీన్ ఎలా ఉంటుందని అందరిలోనూ ఉత్కంఠ రేకేత్తించింది. ఈ సీన్ కోసం ఎప్పుడెప్పుడా అని పాక్ – ఇండియా మ్యాచ్ కోసం ఎదురుచూస్తునట్లు ఏపీ ప్రజలు వెయిట్ చేశారు. మొదటి రోజున అసెంబ్లీలో అలాంటి దృశ్యాలు ఏవి ఆవిష్కృతం కాకపోవడంతో రెండోరోజున తమ కల నెరవేరుతుందనుకున్నా.. చివరి రోజు అసెంబ్లీకి జగన్ డుమ్మా కొట్టారు.
అయితే, సభలో రఘురామకు మాట్లాడే అవకాశం దక్కడంతో జగన్ ను మొదటి స్పీచ్ లోనే గట్టిగా వాయించేశారు. జగన్ పై సెటైర్లు వేశారు.” సింహంలా చెప్పుకునే వారు నిన్ననే సభకు వచ్చి వారి పేరు కూడా మర్చిపోయేలాగా త త త… ప ప ప అన్నారు. ఎందుకంటే, అయ్యన్నపాత్రుడిని స్పీకర్ గా ఎన్నుకుంటున్నారనే అప్పుడే తెలిసిపోయింది కాబట్టి… వారి పేరు కూడా మరిచిపోయే పరిస్థితి వచ్చిందన్నారు.” ఈ వ్యాఖ్యలు జగన్ ని ఉద్దేశించే రఘురామ అనడంతో… ఆర్ఆర్ఆర్ అప్పుడే మొదలుపెట్టేశారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
రానున్న రోజుల్లో జగన్ అసెంబ్లీకి వస్తే రఘురామ తన సెటైర్లలో డోస్ పెంచి మరీ జగన్ ను వాయించేస్తారనే వాదనలు వినిపిస్తున్నాయి.