మంగళవారం అలియా భట్ బర్త్ డే. అలియా నటిస్తున్న కొత్త చిత్రాల నుంచి అప్ డేట్లు వచ్చాయి. బ్రహ్మస్త్ర లో అలియా లుక్‌ని చిత్రబృందం విడుదల చేసింది. కానీ ఆర్.ఆర్.ఆర్ నుంచి ఎలాంటి సందడీ లేదు. బర్త్ డే విషెష్ చెబుతూ చిత్రబృందం ఒక్క పోస్టరూ విడుదల చేయలేదు. సోమవారం ఎత్తర జెండా పాట రిలీజ్ చేశారు. కనీసం ఆ సందర్భంలో అయినా, బర్త్ డే విషెష్ చెప్పొచ్చు. కానీ… ఆ ప్రయత్నమూ కనిపించలేదు.
ఆర్.ఆర్.ఆర్ పాన్ ఇండియా సినిమా. అలియా చిన్న స్టారేం కాదు. బాలీవుడ్లో నెంబర్ వన్ కథానాయిక. సాధారణంగా టీమ్‌లో ఎవరి పుట్టిన రోజు వచ్చినా, పోస్టర్‌తో సెలబ్రేట్ చేయడం ఆర్.ఆర్.ఆర్ టీమ్ కి అలవాటే. కానీ అలియాని మర్చిపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అయితే దానికి ఓ కారణం ఉంది. ఈసారి… ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్లకు అలియా డుమ్మా కొట్టబోతోందని టాక్. గతంలో ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్లలో అలియా కనిపించింది. అయితే బిల్లు మాత్రం.. 3.5 కోట్లు వేసింది. ఈసారి అలియా రమ్మన్నా వస్తుంది. కానీ… మళ్లీ బిల్లు వేస్తుందని భయం. అడిగినంత పారితోషికం ఇచ్చినా, ప్రమోషన్లకు వచ్చినప్పుడు ఇలా బిల్లులతో భయపెట్టడం ఏమిటన్నది జక్కన్న టీమ్ ప్రశ్న. అందుకే అలియాని ఈసారి పిలవలేదు. ఆ కోపంతోనే బర్త్ డే వచ్చినా చిత్రబృందం పట్టించుకోలేదని టాక్. అయితే చరణ్ మాత్రం తన సహ నటి పుట్టిన రోజు సందర్భంలో సోషల్ మీడియాలో ఓ ఫొటో వదిలాడు. అలియాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాడు.