ఉగాది అంటే… తెలుగువారికి అత్యంత ప్రత్యేకమైన పండగ. ఉగాది వస్తుందంటే కొత్త సినిమాల కబుర్లు, పోస్టర్లు, టైటిళ్లూ, టీజర్లూ… ఆ హడావుడి ఒక రేంజులో ఉంటుంది. అయితే కరోనా వల్ల ఆ సందడంతా మాయమైంది. ఇలాంటి తరుణంలో, ఆ లోటు తీర్చడానికి రెడీ అయ్యింది ఆర్.ఆర్.ఆర్ టీమ్. ఆర్.ఆర్.ఆర్ అంటే అర్థం ఏమిటో తెలుసుకోవాలన్న సగటు సినీ అభిమానుల మనసుల్ని అర్థం చేసుకుని, ఉగాది రోజున టైటిల్‌ని ప్రకటించింది. మోషన్ పోస్టర్నీ విడుదల చేసింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో `ఆర్.ఆర్.ఆర్` అంటే అసలు అర్థం వివరించింది. తెలుగులో – రౌద్రం రణం రుధిరం అనేది టైటిల్‌గా ఫిక్స్ చేసింది. తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలకు ఒక్కో టైటిల్ ఇచ్చింది. –
మోషన్ పోస్టర్ మాత్రం.. రాజమౌళి సినిమాల స్థాయిలోనే అదిరిపోయింది. ఎన్టీఆర్ వెంట వేటాడుతున్న చరణ్‌ని చూపిస్తూ మోషన్ పోస్టర్ డిజైన్ చేశారు. మోషన్ పోస్టర్ ఊహ, దానికి ఇచ్చిన ఆర్.ఆర్, అడుగు వేస్తే నిప్పులు చిమ్మడం ఇవన్నీ… రాజమౌళి మార్క్ మాస్ అంశాలు. మొత్తానికి ఆర్.ఆర్.ఆర్ అంటే అర్థం తెలిసిపోయింది. ఇక ఫస్ట్ లుక్కో, టీజరో బయటకు రావడం తరువాయి.