ఆర్ఆర్ఆర్… రాజమౌళి దర్శకతంలో తారక రామారావు, రామ్‌చరణ్ హీరోలుగా నటిస్తున్న మల్టీస్టారర్ యాక్షన్ ఫిల్మ్! సెట్స్ మీదకు వెళ్ళడానికి పట్టుమని పది రోజుల సమయం కూడా లేదు. వచ్చే నెల 5న పూజా కార్యక్రమాలతో సినిమాను ప్రారంభించి, రెగ్యులర్ షూటింగ్ మొదలు పెడతారని తెలుస్తుంది. ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తయ్యాయి. రీసెంట్గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ జిమ్ ట్రయినర్ లాయిడ్ స్టీవెన్స్‌తో కలిసి లుక్ గురించి డిస్కషన్స్ చేశారు. ఎన్టీఆర్ లుక్‌ను రాజమౌళి డిసైడ్ చేశారు. ప్రజెంట్ రామ్‌చరణ్ లుక్ డిసైడ్ చేసే పనిలో పడ్డారు. సోమవారం స్పెషల్ ఫొటోషూట్ సెషన్ స్టార్ట్ చేశారు. ఈ వీకెండ్ వరకూ ఇది వుంటుందని తెలిసింది. వీకెండ్ లోపు చరణ్ లుక్ డిసైడ్ చేసి, నెక్స్ట్ మండే సినిమా మొదలు పెడతారు. ఈ సినిమా కోసం అల్యూమినియం ఫ్యాక్టరీలో స్పెషల్ సెట్స్ ఎప్పుడో రెడీ అయ్యాయి. లేట్ చేయకుండా సెట్స్‌లో వర్క్ స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యారు. అయితే… ఈ సినిమాలో ఇద్దరు దేశీ హీరోయిన్లు, ఒక విదేశీ హీరోయిన్ వుంటారని అనధికారికంగా బయటకు చెబుతున్నారు. కానీ, వాళ్లు ఎవరు అనేది ఇంకా వెల్లడించలేదు. రాజమౌళి పెద్దన్న, అతడి సినిమాలకు ఆస్థాన సంగీత దర్శకుడు కీరవాణి ఈ సినిమాకు స్వరాలు అందిస్తున్న సంగతి తెలిసిందే.