హైదరాబాద్: స్టాక్ మార్కెట్ ఇవాళ కుప్పకూలింది. సెన్సెక్స్ 1,600 పాయింట్లు… నిఫ్టీ 490 పాయింట్లు పడిపాయాయి. చైనా కరెన్సీ విలువ తగ్గించిన ప్రభావం పడటమే దీనికి కారణంగా భావిస్తున్నారు. 2008 సంవత్సరం తర్వాత స్టాక్ మార్కెట్ ఇంత తీవ్రంగా పడిపోవటం ఇదే ప్రథమం. రు.7 లక్షల కోట్లకుపైగా ఇన్వెస్టర్ల సొమ్ము ఇవాళ ఆవిరైపోయింది. అయితే కొన్ని షేర్లు మాత్రం నిలకడగా ఉన్నాయి. దాదాపు 206 షేర్లు లాభాల బాటలో సాగాయి. షేర్ మార్కెట్ వ్యాపారులు ఇవాళ్టి భారీ పతనాన్ని బ్లాక్ మండేగా పిలుస్తున్నారు. రూపాయి మారకం విలువ రెండేళ్ళ కనిష్ట స్థాయికి పడిపోయింది. 65 పైసలు నష్టపోయింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 66.47 రూపాయలు. అవసరమైతే దేశ విదేశీమారక నిల్వలను ఉపయోగించి రూపాయిని నిలబెడతామని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామన్ రాజన్ చెప్పారు. ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాయని, చైనా కరెన్సీ విలువ తగ్గించటమే దీనికి కారణమని, భయపడాల్సిన అవసరంలేదని ఆర్థికశాఖమంత్రి అరుణ్ జైట్లీ అన్నారు.