ఏపీలో ఐపీఎస్లా కాకుండా వైపీఎస్లా పని చేసి కెరీర్ ను చిక్కుల్లో పడేసుకున్న పీవీ సునీల్ కుమార్ వ్యవహారం ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది. గతంలో ఆయనే ట్వీట్లు పెట్టి ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేసేవారు. తన వాదన చెప్పేవారు. అయితే ఇలా చేయడం సర్వీస్ నిబంధనలకు విరుద్ధం కావడంతో అదో సమస్య అవుతుందని ముందై రిటైరై రాజకీయం చేస్తున్న తన మిత్రుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హెల్ప్ తీసుకుంటున్నారు.తన భావాలను ఆర్ఎస్ ప్రవీణ్ చెప్పినట్లుగా ఆయన ట్విట్టర్ హ్యాండిల్లో పోస్టు చేయిస్తున్నారు.
తాజాగా పీవీ సునీల్ ను సస్పెండ్ చేయడంపై సుదీర్ఘమైన ట్వీట్ పెట్టారు. అది చదివిన ఎవరికైనా ఇది ప్రవీణ్ పెట్టాడా..సునీల్ పెట్టాడా అనే డౌట్ వస్తుంది. అంత డీటైల్డ్ గా తన వాదన వినిపించారు. విచిత్రం ఏమిటంటే దళిత ఐపీఎస్లు విమానాలు ఎక్కకూడదా.. విదేశాలకు వెళ్లకూడదా.. లాంటి రాజకీయ పరమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, ఆయన కుమారుడు దావోస్ వెళ్లవచ్చా అంటూ అతి తెలివి ప్రయోగించారు. మాట కంటే ముందు కులాన్ని ప్రస్తావించారు. మొత్తంగా ప్రవీణ్ పేరుతో సస్పెన్స్ ఆర్డర్స్ పై తన వాదనను సునీల్ వినిపించాడన్నమాట.
ఈ ఫీడ్ బ్యాక్ ప్రవీణ్ కుమార్ కు వెళ్లినా..సునీల్ కుమార్ కు వెళ్లినా ఒకటే. కానీ యూనానిమస్ గా.. చేసిన తప్పులకు.. కులాన్ని అడ్డం పెట్టుకోవడం ఏమిటన్న ప్రశ్న వస్తుంది. ప్రభుత్వం ఆయన చేసిన తప్పులను కులం కోణంలో చూడలేదు. సర్వీస్ రూల్స్ పీవీ సునీల్ కు విడిగా ఉండవు. ఐపీఎస్ అధికారి అత్యంత బాధ్యతగా ఉండాలనే.. రూల్స్ పెట్టింది. ఆ బాధ్యతలు తప్పేసి.. తాను దళితుడ్ని అంటే ఎలా?. పీవీ సునీల్ రాజకీయాల్లోకి వెళ్లిపోవాలని ..రిటైర్మెంట్ తీసుకోవాలని ప్రవీణ్ సలహాలు గతంలోనే ఇచ్చారు. ప్రవీణ్ స్వేరో పెట్టుకున్నట్లుగా.. సునీల్ ఓ మత సంస్థను పెట్టుకున్నారు. తర్వాత రాజకీయాల్లోకి వస్తారేమో కానీ..సర్వీసులో ఉండి చేసిన తప్పులకు మాత్రం శిక్ష అనుభవించాల్సి రావొచ్చు.