రిజర్వేషన్లను సమీక్షించాల్సిన అవసరం ఉందని గతంలో చేసిన ప్రకటనకు భిన్నంగా సామాజిక వివక్ష వున్నంతవరకు దేశంలో రిజర్వేషన్లు కొనసాగాలన్నదే తన అభిమతమని ఆర్ఎస్ఎస్ చీఫ్ – మోహన్ భగవత్ చెప్పారు.
రిజర్వేషన్ల రద్దుకు సంఘ్ అనుకూలం కాదని అన్నారు. నాగపూర్ లో ‘సామాజిక సమానత్వం’ అనే అంశం పై ఆయన ఉపన్యశించారి. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా రిజర్వేషన్ విధానాన్ని సమీక్షించాలంటూ భగవత్ చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని సృష్టించాయి. ఆ ఎన్నికల్లో బిజెపి ఓటమికి ఇది కూడా ఒక కారణమని అనేక విశ్లేషణల్లో బయట పడింది.
సామాజిక సమానత్వం అనేది ముందుగా వ్యక్తిగతంగా ప్రారంభం కావాలని, ఆ తర్వాత కుటుంబం, విస్తృత కుటుంబం, సమాజం ఇలా విస్తరించుకుంటూ పోవాలని అన్నారు. సమాజంలోని వైవిధ్యతను గౌరవిస్తూనే ఇది జరగాలన్నారు. సామాజిక సామరస్యత, సమగ్రత భావనను వివరిస్తూ, ఏ మతం, తెగ, సామాజిక సంస్కర్త లేదా సాధువు కూడా మానవుల మధ్య వివక్షను సమర్ధించలేదని అన్నారు.
ఈ వివక్షను అంతమొందించాల్సిన అవసరం వుందని మోహన్ భగత్ గట్టిగా చెప్పారు.