రవితేజ ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. తన చేతిలో చాలా సినిమాలున్నాయి. తాజాగా 68వ చిత్రానికి ఈ రోజే కొబ్బరి కాయ కొట్టారు.చ ప్రశాంత్ మాండవ ఈ చిత్రానికి దర్శకుడు. సుధాకర్ చెరుకూరి నిర్మాత. ఈరోజే కాన్సెప్ట్ పోస్టర్ ని విడుదల చేశారు. కలెక్టరేట్ ఆఫీసు ముందు.. రవితేజ కుర్చీలో కూర్చుని టైప్ చేస్తున్న పోస్టర్ అది. చూస్తుంటే… ఈసారి సీరియస్ సబ్జెక్ట్ నే డీల్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. రవితేజ ఎంచుకున్న కథలు ఎలాంటివైనా, అందులో తన మార్క్ వినోదం ఉండాల్సిందే. మరి ఈ రెండింటి మేళవింపు ఎలా ఉంటుందో తెలియాలంటే ఇంకొన్ని రో్జులు ఆగాలి. రవితేజ `ఖిలాడీ` నిర్మాణానంతర పనుల్లో ఉంది. త్వరలోనే తొలి కాపీ సిద్ధం చేస్తారు. ఆగస్టులో కొత్త సినిమాల హడావుడి మొదలవుతుంది. `ఖిలాడీ` కూడా అప్పుడే రావొచ్చు.