భారత రాష్ట్ర సమితి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రజతోత్సవ సభకు కాంగ్రెస్ ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తోంది. ఎక్కడా అడ్డుకున్నారన్న విమర్శలు రాకుండా జాగ్రత్త పడుతోంది. పార్టీ నాయకులు సభకు వెళ్లి వచ్చేందుకు ఆర్టీసీ బస్సులను అడిగితే.. లేవని చెప్పడం లేదు. ఎన్ని బస్సులు కావాలంటే అన్ని బస్సులు ఇస్తున్నారు. ఆదివారం కావడంతో కొన్ని సర్వీసులు, బస్సులు అందుబాటులో ఉంటాయి. అది కలసి వస్తోంది.
రాజకీయ పార్టీల సభలకు బస్సులను కేటాయించడం ఆర్టీసీకి లాభదాయకమే. అయితే గత ఐదు సంవత్సరాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓ విచిత్రమైన రాజకీయం నడిచింది. బస్సులు అయినా ఏవైనా అధికార పార్టీ కార్యక్రమాలకే కేటాయిస్తారు. డబ్బులు ఇస్తామన్నా సరే.. ప్రతిపక్ష నేతల సభలకు కేటాయించరు. దాంతో అందరూ ప్రైవేటు వాహనాలనే వినియోగిచాల్సి వచ్చేది. ఏపీలో.. తెలంగాణలో అలాగే జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం.. పరిస్థితి మారిపోయిది. ఆర్టీసీకి వచ్చే ఆదాయాన్ని ఎందుకు వదులుకోవాలని అన్ని పార్టీలుక కేటాయిస్తున్నారు.
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీలు తమ కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు ప్రభుత్వం సహకరించాలి. ఆ కార్యక్రమాల పేరుతో శాంతిభద్రతల సమస్యలు సృష్టిస్తే మాత్రం కఠినంగా అణిచివేయాలి. తెలంగాణలో ప్రతిపక్ష రాజకీయాలు నేరమయంగా లేవు. ఏపీతో పోలిస్తే చాలా బెటర్ గా ఉన్నాయి. అందుకే అధికార, ప్రతిపక్షాల మధ్య జోరుగా రాజకీయం నడుస్తోంది.