కెనడా ప్రధానిగా జస్టిన్ ట్రూడో రాజీనామా చేశారు. ఆయన స్థానంలో మరో ప్రధానిని ఎంపిక చేసుకోవడానికి అధికార పార్టీ ప్రక్రియ ప్రారంభించింది. ఆ పార్టీకి చెందిన చాలా మంది రేసులోకి వస్తున్నారు. తాజాగా ఈ రేసులో రూబీ ధల్లా అనే మహిళా పారిశ్రామికవేత్త వచ్చారు. కెనడాకు తానే సరైన నాయకత్వాన్ని అందిస్తానని అంటున్నారు. ఆమె గట్టిగానే ప్రధాని పదవి కోసం ప్రయత్నిస్తున్నారు.
రూబీ ధల్లా మూడు సార్లు పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. జస్టిన్ ట్రూడోకి మద్దతుదారే కానీ..ఆయన ఇతర దేశాలతో పెట్టుకున్న వైరానికి మాత్రం వ్యతిరేకం. తాను వస్తే అన్ని దేశాలతో సక్రమంగా సంబంధాలు నిర్వహిస్తానని చెబుతున్నారు. రాజకీయాల కోసం భారత్ పై జస్టిన్ ట్రూడో చేసిన నిర్వాకాన్ని ఆమె అలా ఖండిస్తున్నారు. తాను వస్తే అక్రమ వలసదారుల్ని పంపేస్తానని.. సుంకాల నుంచి ఉపశమనం కల్పిస్తానని ప్రచారం చేస్తున్నారు.
లిబరల్ పార్టీ సభ్యులంతా ప్రధానిని ఎన్నుకుంటారు. ఈ ప్రక్రియ మార్చి 9న జరుగుతుంది. పలువురు రేసులోకి వస్తున్నారు.. వెళ్తున్నారు. ఎవరు గెలుస్తారో వారు ప్రధాని అవుతారు. అయితే ఆ తర్వాత వారి నేతృత్వంలో అసలైన ఎన్నికలను ఎదుర్కోవాల్సిన ఉంటుంది. లిబరల్స్, కన్జర్వేటివ్ ల మధ్య పోరాటం జరగనుంది. ట్రూడో నిర్వాకంతో .. ఈ సారి కన్జర్వేటివ్ లకు అధికారం దక్కుతుందన్న అభిప్రాయం అక్కడ విస్తృతంగా ఏర్పడింది.