వెంకటేష్ కథానాయకుడిగా ‘సైంధవ్’ చిత్రానికి ఇటీవలే క్లాప్ కొట్టారు. హిట్, హిట్ 2 చిత్రాలతో ఆకట్టుకొన్న శైలేష్ కొలను దర్శకుడు. ఇందులో వెంకీ పోలీస్ ఆఫీసర్గా నటించనున్నట్టు సమాచారం. కథ ప్రకారం ముగ్గురు హీరోయిన్లు ఉంటారట. అందులో ఓ కథానాయికగా రుహానీ శర్మని ఎంచుకొన్నారు. ‘చిలసౌ’తో ఆకట్టుకొంది రుహానీ. అంతే కాదు.. ‘హిట్ 1’లో రుహానీ కథానాయికగా నటించింది. ఆ సెంటిమెంట్ ని దృష్టిలో ఉంచుకొని శైలేష్.. ఈ కథానాయికని ఎంచుకొన్నారేమో.? మరో ఇద్దరు హీరోయిన్లు ఎవరన్నది త్వరలోనే తెలుస్తుంది. ముగ్గురు హీరోయిన్లున్నారని ఇదేదో రొమాంటిక్ సినిమా అనుకోవాల్సిన అవసరం లేదు. ముగ్గురు హీరోయిన్లూ కథలో భాగంగానే వస్తారు. అంతే తప్ప.. వెంకీతో డాన్సులు, రొమాన్సులూ చేయడానికి కాదు. ఇది చాలా సీరియస్ ఫేజ్లో సాగే కథ అని తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ నవాజుద్దీన్ సిద్దీకీ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. త్వరలోనే పూర్తి వివరాలు బయటకు వస్తాయి.