‘సప్త సాగరాలు దాటి’ సినిమాతో అందర్నీ ఆకట్టుకొంది రుక్మిణి వసంత్. ఆ సినిమా బాక్సాఫీసు దగ్గర ఆడలేదు. కానీ..చాలామందికి ఫేవరెట్. దానికి కారణం రుక్మిణినే. తన సంప్రదాయబద్ధమైన లుక్తో అందరి హృదయాలూ కొల్లగొట్టింది. దాంతో అవకాశాలు వరుస కట్టాయి. ఆమె చేతిలో రెండు పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి. ఒకటి ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమా, రెండోది ‘కాంతార 2’. దాంతో పాటు నాలుగైదు సినిమాల కోసం అడ్వాన్సులు తీసుకొంది.
ఎన్టీఆర్ సినిమా అంటే.. దాదాపుగా సెటిల్మెంట్ కి దగ్గర వచ్చేసినట్టే. పైగా ప్రశాంత్ నీల్ మూవీ. దాంతో పాటు కాంతార 2. ఈ రెండు సినిమాలు చాలు, రుక్మిణి స్టార్ డమ్ ఏంటో చెప్పడానికి. అయితే ఈ రెండు సినిమాలే ఇప్పుడు రుక్ముణి ముందరి కాళ్లకు బంధమేసినట్టు అయ్యింది. ఎన్టీఆర్ సినిమా పూర్తయ్యేంత వరకూ మరో సినిమా చేయకూడదని ఎగ్రిమెంట్ లో ఉందట. ప్రశాంత్ నీల్ చాలా నిదానంగా సినిమాలు తీస్తుంటాడు. ఆయనకు ఎప్పుడు డేట్లు కావాలో ఆయనకే తెలీదు. కాబట్టి అందర్నీ లాక్ చేసేస్తారు. ‘కాంతార 2’ విషయంలోనూ ఇదే జరిగింది. తన సినిమా అయ్యేంత వరకూ మరో సినిమా చేయకూడదని రిషబ్ రూల్ పెట్టాడట. దానికి కూడా అంగీకారం తెలిపింది రుక్మిణి. ఈ రెండు సినిమాలతోనే సతమతమవుతుంటే, రుక్మిణి ఒప్పుకొన్న చిన్నా చితకా సినిమాలు నాలుగైదు ఉన్నాయి. వాళ్లంతా ఇప్పుడు డేట్ల కోసం క్యూ కట్టారు. ఎన్టీఆర్ సినిమా కోసం ఎగ్రిమెంట్ చేస్తున్నప్పుడే రుక్మిణి డిసైడ్ అవ్వాల్సింది. మిగిలిన సినిమాలు చేయకూడదని. కానీ వచ్చిన అడ్వాన్సల్లా అందుకొంది. ఇప్పుడు వాళ్లకు సమాధానం చెప్పలేక సతమతమవుతోంది.
రుక్మిణి విషయంలోనే కాదు. చాలామంది కథానాయికల విషయంలో ఇదే సీన్ రిపీట్ అవుతోంది. పెద్ద హీరో సినిమాలో ఛాన్స్ వచ్చింది కదా, అని రెడీ అయిపోతున్నారు. కానీ ఎగ్రిమెంట్లు మాత్రం వాళ్లని అరెస్ట్ చేస్తున్నాయి. ఆ సినిమా పూర్తవ్వదు, మిగిలిన సినిమాలకు పని చేసేందుకు అవ్వదు. ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమా ఎప్పుడు మొదలవుతుందో, ఎప్పుడు పూర్తవుతుందో.. రుక్ముణి మిగిలిన సినిమాలకు డేట్లు ఎప్పుడు ఇస్తుందో?