రుక్సార్ థిల్లాన్ పేరు చెబితే వెంకనే గుర్తుపట్టే తెలుగు ప్రేక్షకులు తక్కువే. కొత్త హీరో పక్కన ‘ఆకతాయి’ అని ఓ చిత్రం చేసింది. అది ఫ్లాపే. తరవాత నాని ‘కృష్ణార్జున యుద్ధం’లో ఓ నాయికగా నటించింది. అదీ ఆశించిన విజయం సాధించకపోవడంతో రుక్సార్కి పెద్ద గుర్తింపు రాలేదు. ప్రస్తుతం అల్లు శిరీష్ సరసన ‘ఎబిసిడి’ చిత్రం చేస్తోంది.
తెలుగులో స్టార్ హీరోల సరసన అవకాశాలు సంపాదించే స్థాయికి చేరుకోని ఈ భామకు హిందీలో ఓ అవకాశం వచ్చింది. అది పెద్ద చిత్రం కాదు గానీ… చిత్ర బృందంలో గట్టివాళ్లున్నారు. దాంతో పబ్లిసిటీ బాగా చేసుకునే అవకాశం ఈమెకు దక్కింది.
‘టిప్స్’ మ్యూజిక్ రమేశ్ తౌరాణీ కుమార్తె స్నేహ దర్శకురాలిగా పరిచయమవుతున్న ‘భాంగ్రా పా లే’లో రుక్సాన్కి నాయికగా నటించే అవకాశం వచ్చింది. ఇందులో ‘లస్ట్ స్టోరీస్’, ‘రాజీ’, ‘ఉరి’ ఫేమ్ విక్కీ కౌశల్ తమ్ముడు సన్నీ హీరో. పలు హిట్ సినిమాలు తీసిన రోనీ స్క్రూవాలా నిర్మాత. పంజాబీ భాంగ్రా డ్యాన్స్, వెస్ట్రన్ డ్యాన్స్ మిక్స్ చేసి దీన్ని తెరకెక్కించనున్నారు. ఇందులో రుక్సార్ది డ్యాన్సర్ రోల్.