పాస్టర్లకు నెలకు రూ. ఐదువేలిస్తామని సీఎం జగన్ ప్రకటించారు. మేనిఫెస్టోలో పెట్టారు. మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి అమలు చేయాలి. కనీసం ఇతర పథకాల్లా చేసిటన్లుగా చూపించాలి. అంటే ఒక్క సారి అయినా బటన్ నొక్కాలి. అలా నొక్కడానికి లబ్దిదారుల జాబితా అంటూ ఉండాలి కదా.. గత మూడేళ్లుగా పాస్టర్ల జాబితాను రెడీ చేస్తూనే ఉన్నారు ఏపీ ప్రభుత్వం “అర్హత” పేరుతో లబ్దిదారులను ఓ ఆట ఆడుకుంటోంది. పాస్టర్లను కూడా అాలగే ఆడుకుంటోంది.
పాస్టర్లకు అలవి మాలిన రూల్స్ పెట్టడంతో లబ్దిదారులే కనిపించకుండా పోయారు. అలా అయితే ఎలా అని వరుసగా రెండు, మూడు సార్లు నిబంధనలు మార్చారు. మరోసారి నిబంధనలు మార్చారు. చర్చిలు ఎక్కడ ఎలా ఉన్నా పాస్టర్లుగా అర్హులేనని.. ఒకే ఇంట్లో ముగ్గురు…నలుగురు పాస్టర్లు ఉన్నా అర్హులేనని రూల్స్ మార్చేశారు. ఇన్ని రూల్స్ మార్చిన వారు ఇప్పటి వరకూ లబ్దిదారుల జాబితా ఖరారు చేయలేదు.
పాస్టర్లు కూడా ప్రభుత్వం తమతో గేమ్ ఆడుతోందని ఆందోళన చెందుతున్నారు. పాస్టర్లకు ఆర్థిక సాయం చేస్తే ఇతర వర్గాల నుంచి విమర్శలు వస్తాయన్న కారణంగా ప్రభుత్వం ఆగుతోందని.. ప్రభుత్వానికి ఇచ్చే ఉద్దేశం లేదని ఎక్కువ మంది పాస్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం తీరు అలాగే ఉంది. చివరికి అసలు పక్కన పెట్టినా ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తోంది. వారు ఎలాగూ ఇతరులకు ఓట్లు వేయరని.. తమ ఓటు బ్యాంకే కాబట్టి… ఇవ్వకపోయినా పర్వాలేదని అనుకునే అవకాశం ఉందంటున్నారు.