బాలకృష్ణపై ఓ పుకారు స్పీడుగా షికారు చేస్తోంది. బాలకృష్ణ మోకాలికి ఆపరేషన్ జరిగిందని, ప్రస్తుతం బాలయ్య రెస్ట్ మోడ్లో ఉన్నారన్నది ఆ వార్త సారాంశం. బాలయ్య ఆసుపత్రిలో అభిమానులతో తీయించుకున్న ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి. దాంతో… బాలయ్య ఫ్యాన్స్ `మా హీరో త్వరగా కోలుకోవాలి` అంటూ సందేశాలు పంపుతున్నారు.
అయితే.. బాలయ్యకు ఎలాంటి ఆపరేషన్ జరగలేదని సన్నిహితులు క్లారిటీ ఇచ్చారు. ఇటీవల ఆయన రెగ్యులర్ చెకప్ కోసం ఆసుపత్రికి వెళ్లార్ట. అప్పటి ఫొటోలు అవని తేల్చేశారు. దయచేసి తప్పుడు వార్తల్ని ప్రచారం చేయొద్దని బాలయ్య పీఆర్ టీమ్ కోరుతోంది. బాలయ్య ఎలాంటి రెస్ట్ మోడ్ లోనూ లేరని, ఈరోజు హైదరాబాద్ లోని సారధి స్టూడియోలో షూటింగ్ లోనూ పాలుపంచుకుంటున్నారని క్లారిటీ ఇచ్చింది. బాలకృష్ణ – గోపీచంద్ మలినేని కాంబినేషన్లో ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ రోజు ఆ షూటింగ్లోనే బాలయ్య పాల్గొంటారు.