సౌఖ్యం, గౌతమ్నంద, ఆక్సిజన్ ఫ్లాపులతో గోపీచంద్ కథలు, దర్శకులు, నిర్మాతల ఎంపికలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్టాడు. ముందు కథ కుదరాలి. తర్వాత దర్శకుడు కుదరాలి. రెండూ సెట్ అయ్యాక మంచి నిర్మాత చేతిలో సినిమా పెట్టాలి. ఒకవేళ నిర్మాత కథతో పాటు దర్శకుణ్ణి తీసుకువస్తే నచ్చితేనే సినిమా చేయాలి. లేదంటే వదిలేయాలి. ఇప్పుడు గోపీచంద్ ఫిలాసఫీ ఇదేనని ఆయన సన్నిహితుల కథనం. ముఖ్యంగా ‘ఆరడుగుల బులెట్’ నిర్మాత విషయంలో గోపీచంద్ బాగా హర్ట్ అయ్యాడు. దీనికి తోడు హ్యాట్రిక్ ఫ్లాపులు ఈ హీరోని ఆలోచనలో పడేశాయి. ఇటువంటి సమయంలో గోపీచంద్ హీరోగా వీరూ పోట్ల దర్శకత్వంలో బీవీఎస్ఎన్ ప్రసాద్ ఒక సినిమా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారని వార్త వచ్చింది. కానీ, ఈ వార్తలో కొంచెం కూడా నిజం లేదని తెలిసింది. ప్రస్తుతం గోపీచంద్ కొత్త దర్శకుడితో ‘బెంగాల్ టైగర్’ నిర్మాత రాధామోహన్ నిర్మాణంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇది పూర్తయ్యాక తర్వాత సినిమాపై నిర్ణయం తీసుకుంటాడట మరోపక్క నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ సన్నిహితులు కూడా వీరు పోట్ల సినిమా వార్త వట్టి పుకారు మాత్రమే అంటున్నారు. ‘ఈడు గోల్డ్ ఎహె’ ఎఫెక్ట్ నుంచి తప్పించుకుని వీరుపోట్ల నెక్స్ట్ సినిమా ఛాన్స్ ఎప్పుడు అందుకుంటాడో?