ఈమధ్య ఓ వెబ్ సైట్ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్‌కి అతి సమీపంలో ఉన్న నందమూరి బాలకృష్ణ ఇల్లు షాపింగ్ మాల్గా మారుతుందన్న వార్త ప్రచురించింది. బాలయ్య ఇల్లు షాపింగ్ మాల్గా మారడం ఏమిటి? అని అభిమానులు సైతం ఆశ్చర్యపోయారు. నిజానికి.. అది కేవలం గాసిప్ మాత్రమే. బాలయ్య ఇల్లు షాపింగ్‌మాల్‌గా మారడం లేదు. ఈ విషయాన్ని బాలకృష్ణ సన్నిహితులు ధృవీకరిస్తున్నారు కూడా. నగరంలో బాలయ్యకు చాలా చోట్ల ఆస్తులున్నాయి. అందులో కమర్షియల్ సైట్లు ఎక్కువే. పెద్దమ్మ గుడి సమీపంలో బాలయ్యకు ఓ కమర్షియల్ సైట్ ఉంది. దాన్ని మాల్గా మార్చే ఆలోచన ఉంది. ఆ విషయం మరిచిన సదరు వెబ్ సైట్ ఏకంగా బాలయ్య ఇల్లే షాపింగ్ మాల్గా మారుతుందని వార్త పుట్టించి, అభిమానుల్లో గుబులు రేకెత్తించారు. బాలయ్యకు సెంటిమెంట్ల పాళ్లు చాలా ఎక్కువ. నూటికి నూరుపాళ్ల వాస్తుతో నిర్మించిన తన ఇల్లంటే ఆయనకు సెంటిమెంట్. ఆ ఇల్లు వదిలే ప్రసక్తి లేదు.. దాన్ని షాపింగ్ మాల్గా మార్చే అవకాశమే లేదని ఆయన సన్నిహితులు క్లారిటీ ఇచ్చేశారు. సో… బాలయ్య ఇంటిపై బెంగ అక్కర్లెద్దు.