హైదరాబాద్‌లో ఫుట్‌పాత్‌లపై ఆక్రమణల తొలగింపును ఓ ఉద్యమంలా చేస్తున్నారు. ఎంత పెద్ద సంస్థ అయినా సరే.. ఫుట్ పాత్ పై ఆక్రమణలు చేసినట్లు తేలితే … నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తున్నారు. ఆయా కార్యాలయాలు, దుకాణాల్లో వెళ్లే దారుల విషయంలో వేరే ఆప్షన్ లేకపోయినా అధికారులు వదిలి పెట్టడం లేదు. ఫుట్‌పాత్‌ల ఆక్రమణలను నిస్సంకోచంగా తీసేస్తున్నారు. ఈ అయితే ఈ విషయంలో… సోమాజీగుడకు వచ్చే సరికి…. ఈనాడు బిల్డింగ్ కు మినహాయింపు ఇచ్చేశారంటూ కొంత మంది ప్రచారం ప్రారంభించారు. ప్రభుత్వ పెద్దల స్థాయిలో అధికారులపై ఒత్తిడి తెచ్చి కూల్చేయాల్సిన ఈనాడు కాంపాండ్ ను కూల్చకుండా అడ్డుకున్నారనేది ఆ వార్తల సారాంశం.
నిజానికి ఈనాడుపై అమితమైన ద్వేషంతోనే ఈ వార్తలు పుట్టించారని సులువుగా అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం… తెలంగాణ ప్రభుత్వం… రోడ్డు వెడల్పు చేయడం లేదు. కేవలం ఆక్రమణలు మాత్రమే తొలగిస్తోంది. రోడ్డు మీదకు చొచ్చుకు వచ్చి… నిర్మాణాలు చేసిన… భవనాలు. మెట్లను కూడా వదిలి పెట్టడం లేదు. అలాగే… సోమాజిగూడ రోడ్డులోనూ అలాగే చేసింది. ఇందులో విశేషం ఏమీ లేదు. ఇలా చేసినా.. ఈనాడు గోడ పగుల గొట్టకపోవడం ఏమిటనేది కొందరి ఆవేదన. అది ఆక్రమణ కానప్పుడు ఎందుకు పగులగొడతారనే విషయాన్ని మాత్రం దాచేసి… ఈ కథనాలను ప్రసారం చేస్తున్నారు. నిజానికి రోడ్ వెడల్పు చేయాలనుకుంటే.. దాని ప్రకారం.. ఆయా సంస్థలకు… నోటీసులు జారీ చేసి… నష్టపరిహారం ఇచ్చి స్థలాన్ని తీసుకుంటారు. అప్పుడు మాత్రమే పగుల గొడతారు. నిజానికి ఈనాడు భవనానికి సంబంధించిఓ సారి కొంత స్థలం ప్రభుత్వం తీసుకుంది కూడా. ఇవన్నీ తెలిసి కూడా.. కొంత మంది… అదేదో ఆక్రమణ అయినట్లు.. ఈనాడు కాబట్టి.. చూసీ చూడనట్లు ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు.
ఇలాంటి ప్రచారం వెనుక ప్రధానంగా రాజకీయ కోణం ఉందనే విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ వ్యాపారులకు… అనుకూలంగా ఉంటోందని.. తెలంగాణ వాదుల్లోకి వెళ్లేలా చేసి.. కేసీఆర్ సర్కార్ పై వ్యతిరేకత పెంచడం… అలాగే.. తమకు ఏమాత్రం ఇష్టం లేని మీడియా సంస్థ పైకి… ఆయా ప్రభుత్వాలను ఎగదోయడం … ఈ కథనాల్లో కుట్రలుగా భావిస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో…. వివిధ పార్టీలు ప్యాకేజీలు మాట్లాడుకుని… దుష్ప్రచారాలు చేసేందుకు కొన్ని మీడియాలను పకడ్బందీగా వాడుకుంటోందని… ఇలాంటి కథనాల ద్వారా నిరూపితమవుతాయని.. కొంత మంది జర్నలిస్టులే నిట్టూరుస్తున్నారు.