పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారు?’.. చాలా ఇంటర్వ్యూల్లో శ్రుతిహాసన్ కు ఎదురైయ్యే ప్రశ్న ఇది. ఆమె ప్రేమలో ఉండటమే ఇందుకు కారణం. శ్రుతి ఎన్నిసార్లు సమాధానమిచ్చినా మళ్లీ మళ్లీ ఆమెకు ఈ ప్రశ్న ఎదురవుతూనే ఉంది ‘‘మీ మ్యారేజ్ ఎప్పుడు? ప్లాన్స్ ఏంటి?’’ అడుగుతూనే వుంటారు. ఆమె మాత్రం ఇప్పట్లో లేదని చెబుతుంటుంది. మీడియాలో మాత్రం యధావిధిగా శ్రుతి పెళ్లి త్వరలోనని వార్తలు పుడుతూనే వుంటాయి.
తాజాగా శృతిహాసన్ ఈ యేడాదే పెళ్లి చేసుకోబోతుందని మళ్ళీ వార్తలు వచ్చాయి. డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికతో ప్రేమలో వుంది. అతడ్నే పెళ్లి చేసుకోబోతోందట. శృతి-శాంతను ఈ ఏడాదిలోనే పెళ్లి చేసుకుంటారని మరోసారి వార్తలు వచ్చాయి. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగ వుంది శ్రుతి. ఈ సంక్రాంతికి వచ్చిన రెండు పెద్ద సినిమాల్లో ఆమెనే హీరోయిన్. ఇది కాకుండా మరి కొన్ని ప్రాజెక్ట్స్ కూడా చేతిలో వున్నాయి. ఇలాంటి నేపధ్యంలో ఆమె పెళ్లి వార్తలు ఏ మేరకు నిజమో తెలియాలి.