టాలీవుడ్ లో మరో గాసిప్ బయల్దేరింది. క్లీన్ సినిమాలు తీసే ఓ దర్శకుడు… ఓ కథానాయికతో అక్రమ సంబంధం పెట్టుకొన్నాడని, ఆమె మోజులో పడి భార్యని నిర్లక్ష్యం చేశాడని, ప్రస్తుతం చెన్నైలో ఆమెతోనే కాపురం చేస్తున్నాడన్నది ఆ గాసిప్ సారాంశం. ఈ గాసిప్పు పుట్టించింది జర్నలిస్టులు కాదు. ఓ అనామకుడు.
కొంతమంది పాత్రికేయులకు ఓ అనామక నెంబర్ నుంచి ఓ మెసేజ్ వచ్చింది. దర్శకుడి పేరు, వివరాలు బయటపెడుతూనే, ఆ దర్శకుడు తాజాగా పని చేసిన సినిమాలో నటించిన కథానాయిక తో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడని, ఇంటిని, భార్యనీ నిర్లక్ష్యం చేస్తున్నాడని, ఈ విషయాన్ని బట్టబయలు చేసి, ఓ కుటుంబాన్ని కాపాడమంటూ జర్నలిస్టుల్ని వేడుకొంటూ వచ్చిన సందేశం అది. నిజానికి సదరు దర్శకుడిపై క్లీన్ ఇమేజ్ ఉంది. తన మాటలు, చేష్టలు, సినిమాలూ అన్నీ క్లాస్‌గా ఉంటాయి. అలాంటి దర్శకుడు ఇప్పుడు అక్రమ సంబంధం పెట్టుకొన్నాడన్న వార్త నమ్మబుద్ది కావడం లేదు. ఈ విషయాన్ని ఎవరో పని గట్టుకుని బయటకు లాగాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారో అర్థం కావడం లేదు. ఇది గాలి వార్తా? కావాలని ఆ దర్శకుడ్ని ఇరుకున పెట్టడానికి ఎవరైనా ఇలా చేస్తున్నారా, లేదంటే నిజంగానే ఆ దర్శకుడు అక్రమ సంబంధం పెట్టుకొన్నాడా? అనేది తెలియాల్సివుంది. కాకపోతే… ఒకేసారి జర్నలిస్టులందరికీ ఒకే మెసేజీ ఫార్వర్డ్ చేశాడంటే.. కచ్చితంగా ఎవరో కావాలనే ఇదంతా చేస్తున్నారనిపిస్తుంది. త్వరలో ఆధారాలు కూడా కొన్ని బయటపెట్టే అవకాశాలు ఉన్నాయి. అవి బయటకు వస్తే కానీ, అసలు వ్యవహారం తేలదు.