అశ్వనీదత్… తెలుగు నాట భారీ చిత్రాలకు ఆయన కేరాఫ్ అడ్రస్స్. తరం మారినా.. ఆయన మాత్రం అప్డేటెడ్ గానే ఉంటారు. తన బ్యానర్లో సినిమా అంటే, కథ.. సంగీతం.. ఇలా అన్ని విషయాల్నీ దగ్గరుండి చూసుకొంటారు. `సీతారామం`లోనూ ఆయన భాగస్వామ్యం చాలా ఉంది. ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ లో ఆయన కూర్చున్నారు. దర్శకుడు హను రాఘవపూడితో దాదాపు ఏడాది ప్రయాణం చేసి.. కథని లాక్ చేశారు. ఇప్పుడు ఎడిటింగ్ టేబుల్ దగ్గర కూడా ఆయన తన అనుభవాన్నిచూపించారు.
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాగూర్ జంటగా నటించిన చిత్రం `సీతారామం`. హను రాఘవపూడి దర్శకుడు. ఆగస్టు 5న విడుదల అవుతోంది. ఇప్పుడు ఈ సినిమా రన్ టైమ్ కూడా లాక్ అయ్యింది. 2 గంటల 37 నిమిషాల సినిమా ఇది. నిజానికి ఫైనల్ రన్ టైమ్ 2 గంటల 47 నిమిషాలు వచ్చింది. సినిమా చూసుకొన్న అశ్వనీదత్.. పది నిమిషాలు ట్రిమ్ చేశార్ట. ఆడియోలో మొత్తం 9 పాటలున్నాయి. అయితే సినిమాలో మాత్రం ఆరు పాటలే వినిపిస్తాయి. అశ్వనీదత్ అల్లుడు నాగ్ అశ్విన్ కూడా ఫైనల్ కాపీ చూశారు. ఆయన కూడా కొన్ని సలహాలు ఇచ్చిన మీదట ఈసినిమాలో పది నిమిషాల నిడివిగల సీన్లకు కత్తెర పడింది. 2 గంటల 37 నిమిషాలంటే ఈ రోజుల్లో కాస్త ఎక్కువే. కానీ సినిమా బాగుంటే.. నిడివి పెద్ద భారం కాదు.