ఈ సంక్రాంతికి చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, బాలయ్య ‘వీర సింహారెడ్డి’ చిత్రాలు బరిలో ఉన్నాయి. వీటికి సంబంధించిన రన్ టైమ్ కూడా లాక్ అయ్యింది. వాల్తేరు వీరయ్య 2 గంటల 33 నిమిషాలైతే, బాలయ్య సినిమా 2 గంటల 43 నిమిషాలకు ఫిక్స్ అయ్యాయి. ఓ రకంగా బాలయ్య సినిమా లెంగ్తీగా ఉన్నట్టే లెక్క. అయితే అఖండ 2 గంటల 45 నిమిషాల సినిమా. అయినా జనం చూశారు. సినిమా బాగుంటే రన్ టైమ్ తో లెక్కేం ఉంది. కాబట్టి.. 2 గంటల 43 నిమిషాలు పెద్ద మేటరేం కాదు. పైగా.. బాలయ్య సినిమాలో 7 ఫైట్లు, 5 పాటలు ఉన్నాయి.
ఈనెలలోనే రెండు చిత్రాలకు సంబంధించిన ప్రమోషన్లు మొదలెట్టాలని మైత్రీ మూవీస్ భావిస్తోంది. ఈ రెండు సినిమాల్నీ మైత్రీ మూవీస్ సంస్థే నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈనెల 16న అవతార్ వస్తోంది. ఈనెల 23న రవితేజ సినిమా రెడీ అయ్యింది. 23 తరవాత… సంక్రాంతి సినిమాల ప్రమోషన్లు మొదలైపోతాయి. చిరంజీవి వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఆంధ్రాలో చేయాలని ఫిక్స్ అయినట్టు సమాచారం. చిరు ఓ రైలు యాత్ర చేయబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. అయితే రైలు యాత్ర ఇంకా ఖరారు కాలేదని అది కేవలం చర్చల దశలో ఉందని తెలుస్తోంది.