జగన్మోహన్ రెడ్డి ఇష్టపడి కట్టుకున్న రుషికొండ ప్యాలెస్ ఇప్పుడు దేశాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. లోటులో ఉన్న రాష్ట్రం… వారానికి మూడు, నాలుగు వేల కోట్లు ఆర్బీఐ దగ్గర అప్పు తీసుకు రానిదే రోజు గడవని రాష్ట్రంలో జగన్ తాను విశాఖ నుంచి పరిపాలన చేయాలన్న కోరికతో పర్యావరణ విధ్వంసానికి పాల్పడి .. వందల కోట్లు ప్రజాధనం దోచిపెట్టి కట్టించిన ప్యాలెస్ ను చూసి దేశం కూడా ఆశ్చర్యపోతోంది. రాజకీయ నేతల్లో ఇంత జల్సాతనం.. బాధ్యతారాహిత్యం వచ్చిందా అని చర్చించుకుంటున్నారు.
జాతీయ మీడియా చానళ్లన్నీ జగన్ ప్యాలెస్ పై ప్రత్యేక కథనాలు ప్రసారం చేస్తున్నాయి. రిపబ్లిక్ టీవీ ఆర్నాబ్ గోస్వామి ఈ ప్యాలెస్ ను సద్ధాం హుస్సేన్ ప్యాలెస్ గా అభివర్ణిస్తున్నారు. ఇతర మీడియా చానళ్లు కూడా అదే చెబుతున్నాయి. విచ్చలవిడిగా ఖర్చు చేసి కట్టిన ఈ భవనంపై చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.
ఈ భవనంపై జరుగుతున్న ప్రచారం అబద్దమని చెప్పేందుకు కొంత మంది వైసీపీ నేతలు ఇంగ్లిష్ చానళ్లతో మాట్లాడుతూ మరింత పరువు తీసుకుంటున్నారు. అది రాష్ట్రపతి, ప్రధానుల విడిది కోసమంటూ వారిపైకి నెట్టేస్తున్నారు. అయితే రాష్ట్రపతి , ప్రధానులు వస్తే ఎక్కడుండాలో వారికి ప్రత్యేకమైన విడిది నేవల్ బేస్‌లో ఉంటుందని గుర్తు చేస్తున్నారు. చేసిన తప్పును సమర్థించుకోవడానికి వారిపైకి నిందలేయడంపైనా విమర్శలు వస్తున్నాయి. ముందు ముందు ఈ ప్యాలెస్ విషయంలో మరిన్ని సంచనల విషయాలు బయటకు రానున్నాయి.