జగన్ రెడ్డి నిర్మించుకున్న రుషికొండ ప్యాలెస్ ఇప్పుడు జాతీయ స్థాయిలో హైలెట్ అవుతోంది. అప్పుల పాలయిన ఓ రాష్ట్రంలో నాయకుడు తన కోసం నిర్మించిన ఇంటిని చూసి దేశం మొత్తం ఆశ్చర్యపోతోంది. సద్దాం హుస్సేన్ విలాసాలను గుర్తు తెచ్చుకుంటోంది. ఆ ప్యాలెస్ లో ఒక్కొక్క దానికి పెట్టి నఖర్చు చూసి అందరికీ మైండ్ బ్లాంక్ అయిపోయింది. రిపబ్లిక్ టీవీ ఆర్నాబ్ గోస్వామి .. ప్రజాధనాన్ని ఇలా వృధా చేయడాన్ని ఘోరమైన నేరంగా అభివర్ణించారు.
పాలనను విశాఖ నుంచి చేయడానికి జగన్ రెడ్డి ఎంచుకున్న మార్గం రుషికొండప్యాలెస్. బీచ్ వ్యూలో ఉండి … వర్క్ ఫ్రం హోం చేసి …అప్పుడప్పుడు బటన్లు నొక్కి ప్రజల డబ్బునే కొంత వారి ఖాతాల్లో వేసి తాను జల్సా చేయాలనుకున్నారు. అత్యంత దారుణంగా వందలకోట్లు ఖర్చుపెట్టి ఇల్లు నిర్మించుకున్నారు. బాత్ రూమ్ కమోడ్ కోసం పదిహేను లక్షలు ఖర్చు పెట్టారంటే మామూలు విషయం కాదు. అందుకే జగన్ నిర్మించుకున్న ప్యాలెస్ వ్యవహారం జతీయ స్థాయిలో హైలెట్ అవుతోంది.
బాధ్యత లేని పాలకుల చేతిలో అధికారం ఉంటేఎలా చేస్తారో అన్నదానికి జగన్ రెడ్డే పెద్ద ఉదాహరణ అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అది ప్రభుత్వ భవనం అని చెప్పడానికి వైసీపీ ప్రయత్నిస్తోంది. అంతకు ముందు అక్కడ ఉన్న రిసార్టులు ప్రభుత్వ భవనాలే. వాటి ద్వారా ఏటా పాతికకోట్ల రూపాయల ఆదాయం వచ్చేది. ఇప్పుడు ఈభవనాలతో ఏం వస్తుంది?.,
చేసింది తప్పు.. సమర్థించుకోవడానికి వైసీపీ చేస్తున్న తప్పిదాలు అన్నీ ఇన్నీ కావు. ప్రజలు పన్నులరూపంలో కట్టిన డబ్బుతో చిన్న రోడ్డు వేయడానికి మనసొప్పలేదు కానీ ఇలాంటి నిర్వాకాలు మాత్రం ఎన్నో చేశారు.