ఓ వైపు ఉక్రెయిన్ యుద్ధంలో లక్షల మంది సైనికులు చనిపోతున్నారు.. మరో వైపు పిల్లల్ని కనేందుకు రష్యా జంటలు ఆసక్తి చూపించడం లేదు. దీంతో పుతిన్‌కు తమ దేశ భవిష్యత్ పై బెంగ పెట్టుకుంది. దేశమంటే మనుషులేనని ఆయనకూ తెలుసు. అందుకే ఇప్పుడే చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. అందరూ శృంగారంలో మునిగి తేలేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు, సమయం ఉండేలా చూసేందుకు ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని నిర్ణయించారని ఇంటర్నేషనల్ మీడియా ప్రకటించింది.
ఓ అమ్మాయి, అబ్బాయి మొదటి సారిగా డేట్‌కు వెళ్తే.. ఐదువేల రూబుల్స్ ఇస్తారట. ఇంకాచాలా స్కీమ్స్ గురించి ఆలోచిస్తున్నారు. ఆఫీస్ అవర్స్ లో శృంగారం చేసుకోవడానికి సమయం.. వీకెండ్స్ లో గడపడానికి ప్రత్యేక ఏర్పాట్లు.. ఇలా చాలా ఆలోచనలు చేస్తున్నారు. ఇప్పటికే పది మందిని కన్నా ఎక్కువ మంది పిల్లల్ని కంటే మిలియన్ రూబుల్స్ ఇస్తున్నారు. మదర్ హీరోయిన్ అనే అవార్డు కూడా ఇస్తున్నారు.
ఎంత చేసినా పిల్లల సంఖ్య మాత్రం పెరగడం లేదు. ప్రతీ ఏటా జన్మించేవారి సంఖ్య తగ్గిపోతోంది . అందుకే బలవంతంగా అయినా పిల్లలను కనేలా చేయడానికి ప్లాన్ చేస్తున్నారన్న కథనాలు వస్తున్నాయి. పిల్లల్ని కనడానికి ఆరోగ్యంగా ఉన్న మహిళల వివరాలన్నీ సేకరిస్తున్నారు. అయితే పెంచడం కష్టం కాబట్టి అక్కడి జంటలు పిల్లలు వద్దనుకుంటున్నారు. శృంగార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి…బలవంతంగా పిల్లల్ని కనేలా పుతిన్ చేయడం సాధ్యమవుతుందా ? అనేది ఇప్పుడు ఆయనంటే గిట్టని దేశాలు కూడా ఆసక్తిగా పరిశీలిస్తున్నాయి.