ఎలాంటి అంచనాలు లేకుండా సంచలనాలు నమోదు చేసిన చిత్రం ‘ఆర్ఎక్స్ 100’. హీరోగా కార్తికేయ, హీరోయిన్ గా పాయల్ రాజ్ పుత్, దర్శకుడిగా అజయ్ భూపతికి ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చిపెట్టిన సినిమా ఇది. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించిన ‘ఆర్ఎక్స్ 100’.. ఇప్పుడు బాలీవుడ్ కి వెళ్ళింది. ‘తడప్’ పేరుతో బాలీవుడ్లో రీమేక్ చేశారు. సునీల్ శెట్టి కొడుకు అహాన్ శెట్టి ఈ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. బాలీవుడ్ ట్రైలర్ లో భారీదనం కనిపించింది. యాక్షన్ సీన్స్ ని భారీగా తీశారు. ట్రైలర్ లో ప్రతి ఫ్రేమ్ ని భారీగా చూపించారు.
‘ఆర్ఎక్స్ 100’ తెలుగులో కథ, కంటెంట్ పరంగా సంచలనం రేపింది. అయితే రీమేక్ విషయానికి వచ్చేసరికి బడ్జెట్ సమస్య లేదు. సునీల్ శెట్టి కొడుకు హీరోగా ఎంట్రీ కావడం, సాజిద్ నదియవాలా లాంటి నిర్మాతలు వుండటం వుండటంతో బడ్జెట్ కి వెనకాడకుండా ఖర్చు పెట్టారనే సంగతి ట్రైలర్ చూస్తే అర్ధమౌతుంది. ట్రైలర్ లో చూస్తే ‘ఆర్ఎక్స్ 100’ కథ ని డిస్టర్బ్ చేయకుండా నేటివీటీ మార్పులు చేసి కాస్త భారీగా తెరకెక్కించారనిపిస్తుంది. డిసెంబర్ 3న తడప్ ప్రేక్షకుల ముందుకు రానుంది.