బలమైన పాత్రలలో కనిపించే క్యారెక్టర్ ఆర్టిస్ట్ లకు ఇప్పుడు మాంచి డిమాండ్ వుంది. విజయ్ సేతుపతి లాంటి నటులు హీరోగా చేస్తూనే మరొకరి చిత్రాల్లో బలమైన పాత్రలు పోషిస్తున్నారు. దీని కోసం రెమ్యునిరేషన్ కూడా భారీగా అందుకుంటున్నారు. నిర్మాతలు కూడా అడిగినంత ఇవ్వడానికి సిద్ధంగా వున్నారు. ఇప్పుడు నాని ‘సరిపోదా శనివారం’ సినిమాలో ఎస్.జే సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందు కోసం ఆయన రికార్డ్ బ్రేకింగ్ రెమ్యునిరేషన్ తీసుకున్నారు.
ఈ సినిమా కోసం దాదాపు 8కోట్లు పారితోషికంగా అందుకుంటున్నారు సూర్య. ఆయనకి ఇప్పుడు మంచి డిమాండ్ వుంది. తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఆయన పాపులర్. ఇటివల చేసిన మార్క్ అంటోనీ సినిమా ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ కి బాగా నచ్చింది. నాని సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో చేస్తున్నారు. ఆ పాత్రకు సూర్య అయితేనే సరైన న్యాయం జరుగుతుందని భావించిన నిర్మాతలు ఆయన అడిగినంత ఇచ్చి తీసుకున్నారు. ఒక క్యారెక్టర్ రోల్ కి ఈ స్థాయిలో రెమ్యునిరేషన్ అందుకోవడం సూర్యకి ఇదే తొలిసారి. ప్రియంక ఆరుళ్ మోహన్ ఈ సినిమాలో కథానాయిక.