నల్గొండ సమీపం లో (హైదరాబాద్ శివారు ప్రాంతం) విజయవాడ హైవే కి దగ్గర గా రాజమౌళి ఎంతో ముచ్చటపడి నిర్మించుకుంటున్న ఫాం హౌస్ ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ లో టాక్ ఆఫ్ ద టౌన్ అయింది. దాదాపు 120 ఎకరాల్లో నిర్మిస్తోన్న ఈ ఫాం హౌస్ డిజైన్, పర్యవేక్షణ బాధ్యతలు ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి (జాతీయ అవార్డ్ విన్నింగ్ ఆర్ట్ డైరెక్టర్ ) కి ఇచ్చినట్టు తెలుస్తోంది.
హైదరాబాద్ శివారు ప్రాంతంలో 120 ఎకరాల తోటను రాజమౌళి కొనుగోలు చేయడం జరిగింది. ఇందులో వంద ఎకరాల్లో 50 ఎకరాలు మామిడి తోట మరియు సపోట తోట కి కేటాయించారు. మిగిలిన మొత్తంలో ఒక ఎకరం లో ఒక పెద్ద బంగ్లాను కట్టనున్నారట. దానితోపాటు కొన్ని చిన్న చిన్న కుటీరం లాంటి ఇళ్లను నిర్మించనున్నాడు. మిగిలిన ప్రాంతంలో పశువుల పాకలు, పశుగ్రాసం కోసం కొంత కేటాయించనున్నారట. అంటే ఇటు అత్యాధునిక హంగులతో పాటు కొంత స్థలంలో అటు వ్యవసాయం చేసే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నారట. అంతే కాదు , కేవలం ఇళ్లే కాకుండా, లోపల ఒక్కొక్క చోటికి దారులు ఎలా ఉండాలనేది కూడా ఈ డిజైన్ లో వుంటాయని తెలుస్తోంది.
మొత్తానికి – దారులు, ఇళ్ళు, బంగ్లాల తో అటు మహిష్మతి లోని రాజసాన్ని, అలాగే వ్యవసాయం చేసే పొలం, పశువులు, కుటీరాలతో అటు మర్యాద రామన్న లోని సహజత్వాన్ని మేళవించి రాజ మౌళి నిర్మించుకుంటున్న ఈ ఫాం హౌస్ ని చూస్తే, రాజమౌళి తను జీవితం లో చేసే ప్రతి పనినీ ఎంతగా ప్రాణం పెట్టి చేస్తాడో అర్థమవుతోంది. మరి దేశం లోనే నంబర్ 1 డైరెక్టర్ ఎందుకయ్యాడో ఇప్పుడు ఇంకా బాగా అర్థమవుతోంది!!!