అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు న్యాయం చేయాలనే విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానాల్లేవు. ప్రభుత్వం ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా.. ప్రతిపక్షం ఒత్తిడి చేయాల్సిన బాధ్యత కూడా అంతే ఉంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీకి చెందిన సాక్షి పత్రిక చేస్తోంది మాత్రం తేడాగా కనిపిస్తోంది. డిపాజిటర్లలో లేని పోని ఆందోళనలు రేకెత్తించి.. రాజకీయ ప్రయోజనాలు చూసుకోవాలని అనుకుంటోంది కానీ… ప్రజాప్రయోజనాలు పట్టించుకునే ప్రయత్నం మాత్రం చేయడం లేదు. ఈ రోజు సాక్షి దినపత్రికలో.. అగ్రిగోల్డ్ విషయంలో… ఆ పత్రిక ఇచ్చిన న్యూస్ చూస్తే.. కచ్చితంగా డిపాజిటర్లతో పొలిటికల్ గేమ్ ఆడాలనుకుంటోందన్న విషయం మాత్రం స్పష్టమయిపోతోంది.
నాలుగు రోజుల క్రితం… హాయ్‌ల్యాండ్ అనే ఆస్తి.. అగ్రిగోల్డ్‌ది కాదన్నట్లుగా… ఆ సంస్థకు చెందిన ఎండీ, లాయర్లు హైకోర్టులో వాదించారు. దాన్ని పట్టుకుని గగ్గోలు రేపారు బీజేపీ, వైసీపీ నేతలు, సాక్షి పత్రిక పుంఖానుపుంఖాలుగా కథనాలు రాసింది. అంతా చంద్రబాబే చేయిస్తున్నారని చెప్పుకొచ్చింది. ఆందోళనలకు ఎగదోసింది. ఈ రోజు.. హాయ్ ల్యాండ్ ముట్టడికి ఎగదోసింది. ఇంతలోనే దీనిపై… ప్రభుత్వం కూడా లోతైన పరిశీలన జరిపింది. అగ్రిగోల్డ్ వ్యవహారాలు చూస్తున్న కుటుంబరావు… హాయ్‌ల్యాండ్ అగ్రిగోల్డ్ కంపెనీదేనని.. చరిత్ర బయటకు తీసి మీడియా ముందు పెట్టారు. ఈ లోపే… అగ్రిగోల్డ్ యాజమాన్యం కూడా.. ఈ విషయంలో..స్పష్టత ఇచ్చింది. హాయ్‌ల్యాండ్.. అగ్రిగోల్డ్ దేనని… తాము హైకోర్టులో… కూడా చెప్పామని చెప్పింది. దీంతో…. ఆ విషయంలో క్లారిటీ వచ్చింది.
హాయ్‌ల్యాండ్.. అగ్రిగోల్డ్‌దేనని..స్పష్టత వచ్చిన తర్వాత సాక్షి పత్రిక ఏం చేయాలి..? డిపాజిటర్లు ఆందోళ చెందకుండా… సమాచారం చేరవేయాలి. కానీ.. సాక్షి పత్రికలో.. ఈ విషయాన్ని ప్రాధాన్యం ఇవ్వకుండా.. ఈ రోజు … హాయ్‌ల్యాండ్ ముట్టడికే ప్రాధాన్యం ఇచ్చింది. అంటే.. డిపాజిటర్లు ఏమై పోయినా పర్వాలేదు… జరగాల్సిన రచ్చ జరిగితే చాలన్నట్లుగా… సాక్షి తీరు ఉంది. ముందు నుంచి… అగ్రిగోల్డ్ విషయంలో సాక్షి, వైసీపీ తీరు అనుమానాస్పదంగానే ఉంది. పీఎంవో సాయంతో… అగ్రిగోల్డ్ ను టేకోవర్ చేయడానికి ప్రయత్నించిన జీఎస్సెల్ గ్రూపును… విజయసాయిరెడ్డి బెదిరించారని గతంలో… టీడీపీ నేతలు ఆరోపించారు. ఇప్పుడు… హాయ్‌ల్యాండ్ విషయంలోనూ అదే తీరులో ఉంటున్నారు.