పబ్లిసిటీతో కలిపి దాదాపు 40 కోట్ల వ్యయంతో నిర్మించారు బెల్లంకొండ శ్రీనివాస్ సాక్ష్యం సినిమాను. అయితే, శాటిలైట్ డిజిటల్ హిందీ రైట్స్ నాలుగింట ఒక వంతుకు పైగా కవర్ చేసేసాయి. విడుదల డేట్ దగ్గరకు వస్తుండడంతో మార్కెటింగ్ షురూ చేసారు. నైజాం ను 7 కోట్లకు వాల్యూ కట్టి దిల్ రాజు దగ్గర పంపిణీకి వుంచారు.
ఆంధ్రను 14కోట్ల రేషియోలో మార్కెట్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే వైజాగ్ మూడు కోట్లకు ఇచ్చారట. అయితే మిగిలిన ఏరియాలు కాస్త ఫ్లెక్సిబుల్ గా వున్నట్లు తెలుస్తోంది. అంటే మరీ 14 మీద కూర్చోకుండా 12 నుంచి 14 మధ్య రేటుతో మార్కెట్ చేసే ప్రయత్నాల్లో వున్నారట.
ఆంధ్ర 14, నైజాం 7 అంటే సీడెడ్ అయిదు అని అనుకున్నా, ఇంకా కొటి వరకు డెఫిసిట్ వుండిపోయే అవకాశం వుంది. మరి ఆ మేరకు ఓవర్ ఫ్లోస్ లో కవర్ చేసుకోవాలేమో? బెల్లంకొండ శ్రీనివాస్ గత సినిమా బోయపాటి డైరక్షన్ లోని జయజానకీ నాయక దాదాపు అన్నీ కలిపి 45 కోట్ల బిజినెస్ చేసింది. కానీ థియేటర్ కలెక్షన్లు మాత్రం ఆంధ్ర 10 కోట్ల లోపుగా, నైజాం ఆరు కోట్ల లోపుగా, సీడెడ్ నాలుగు కోట్ల లోపుగా వసూలు చేసింది. ఈ సినిమా కలెక్షన్ మీద భెల్లంకొండ శ్రీనివాస్ తరువాత సినిమాల మార్కెట్ ఆధారపడి వుంది. ఈ సినిమా కనుక సక్సెస్ అయిపోతే బెల్లంకొండ శ్రీనివాస్ 40 కోట్ల మార్కెట్ వున్న హీరోగా ఫిక్సయిపోతాడు.