మొత్తానికి దిల్ రాజు సాక్ష్యం సినిమా డేట్ ను సెట్ చేసేసారు. మెగా హీరో కళ్యాణ్ విజేత సినిమా కోసం తను రాజ్ తరుణ్ తో నిర్మించే లవర్ సినిమా డేట్ ను వెనక్కు జరపాల్సి వచ్చింది. కానీ అక్కడ అంటే జూలై 20న సాక్ష్యం సినిమా వుంది. అది కూడా రాజుగారి పంపిణీ సినిమానే. దాంతో నిర్మాత అభిషేక్ నామా, హీరో తండ్రి బెల్లంకొండ సురేష్ లను ఒప్పించే పనిలో పడ్డారు.
ముందుగా బెల్లంకొండ సురేష్ ససే మిరా అన్నారు. కానీ ఆఖరికి దిల్ రాజు తన మాటల చాతుర్యం, తన లాజిక్ లు, మ్యాజిక్ లు వాడడంతో సరే అనక తప్పలేదు. దాంతో సాక్ష్యం విడుదల డేట్ జూలై 27కు ఫిక్సయింది. ఈ నెల 7న అడియో చేస్తారు. 27న విడుదల.
దాదాపు 38 కోట్ల భారీ బడ్జెట్ తో తయారైన ఈ సినిమా శాటిలైట్, డిజిటల్, థియేటర్లు అన్నీ కలిపి 40 కోట్ల మేరకు మార్కెట్ కావడం విశేషం. శ్రీవాస్ డైరక్షన్ లో తయారైన ఈ సినిమా కనుక ఓకె అయిపోతే, ఇక బెల్లంకొండ శ్రీనివాస్ 40 కోట్ల మార్కెట్ ఫిక్సయిపోతుంది. లేదూ అంటే మిగిలిన మీడియం హీరోల రేంజ్ కు దిగిపోవాల్సి వుంటుంది.