”రంగస్థలం’ లాంటి క్లాసిక్ తర్వాత సుకుమార్ చాలా గ్యాప్ తీసుకున్నారు. అల్లు అర్జున్ డేట్స్ దొరికేవరకూ వేరే ప్రాజెక్ట్ ముట్టుకోలేదు. చాలా హార్డ్ అండ్ గ్రౌండ్ వర్క్ చేసి ‘పుష్ప’ ని సెట్స్ పైకి తీసుకెళ్ళారు. ఇప్పటి వరకూ ఈ సినిమా నుంచి వచ్చిన ప్రమోషన్ మెటిరియల్ సినిమాపై అంచనాలు పెంచుతూనే వున్నాయి. తాజాగా పుష్ప’ లోని మూడో పాట ‘సామీ నా సామీ’ లిరికల్ వీడియోని విడుదల చేశారు. మౌనికా యాదవ్ పాడిన ఈ పాట చాలా క్యాచిగా వుంది. అయితే ఈ పాటలో రంగస్థలం ‘రంగమ్మ మంగమ్మ’ మ్యాజిక్ కనిపించింది.
రంగస్థలంలో ‘రంగమ్మ మంగమ్మ’ పాట చార్ట్ బస్టర్. సోలో సాంగ్. హీరో పాత్ర గుణగణాలని చెబుతూ హీరోయిన్ పాత్ర పాడుకునే సొగసైన పాట. పుష్పలో ‘సామీ నా సామీ’ పాట కూడా అదే మీటర్ లో సాగింది. హీరో కోసం హీరోయిన్ పాడుకునే పాట. విజువల్స్ కూడా ‘రంగమ్మ మంగమ్మ’ ని గుర్తుకు తెచ్చాయి. శ్రీవల్లి.. పుష్ప రాజ్ పాత్ర గురించి చెబుతూ పాడుకునే ఈ పాట ఇట్టే చెవికి పట్టేసింది. దేవిశ్రీ సింపుల్ అండ్ క్యాచి ట్యూన్ చేయడంలో దిట్ట. ‘సామీ నా సామీ’లో కూడా అదే మార్క్ ఫాలోయ్యారు.
”పిక్కలపై దాక పంచెను కడితే నా పంచ ప్రాణాలు పోయెను సామీ… కార కిళ్ళీ నీవు కస్సుకస్సు నవులుతుంటే నా వళ్ళు ఎర్రగాపండేను సామీ.. రెండు గుండీలు విప్పి గుండెలు చూపిస్తే పాలకుండ లెక్క పొంగిపోతా సామీ..” లాంటి రిరిక్స్ ని మాస్ ఆడియన్స్ ని టార్గట్ చేసుకుంటూ సాగాయి. ఇక వీడియో చివర్లో శ్రీవల్లి .. ‘తగ్గేదిలే” అన్నట్టు ఇచ్చిన పుష్పరాజ్ మ్యానరిజం చూస్తే థియేటర్ ఫ్యాన్స్ విజల్స్ వేయడం పక్కా సామీ అన్నట్టుగా వుంది. డిసెంబర్ 17న ఈ సినిమా తొలి బాగం ప్రేక్షకుల ముందుకు వస్తుంది.