తెలంగాణ అసెంబ్లీలో ఏమీ జరగకుండానే బీఆర్ఎస్ ఏదో జరిగిపోయినట్లుగా మహిళా ఎమ్మెల్యేలతో ఏడుపు రాజకీయాలు చేయడం .. ఎబ్బెట్టుగా మారిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. తనను ఇద్దరు అక్కలు మోసం చేశారని వారిని నమ్మవద్దని కేటీఆర్ యథాలాపంగా అన్న మాటలతో.. బీఆర్ఎస్ వ్యూహం మార్చింది. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరగకుండా.. రేవంత్ ఆ మాటలు తమను ఉద్దేశించే అన్నారంటూ సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిని తెర ముందుకు తెచ్చారు.
అసలు రేవంత్ ఎవరి పేర్లు చెప్పకపోయినా.. వారంతటకే వారే తెరపైకి రావడంతో రాజకీయం మారిపోయింది. సబితా ఇంద్రారెడ్డి మైక్ తీసుకుని కాంగ్రెస్ లోకి తానే రేవంత్ ను పిలిచానని గొప్పలు చెప్పుకున్నారు. కౌంటర్ గా రేవంత్.. తనను మల్కాజిగిరి నుంచి పోటీ చేయమని చెప్పి ఆమె బీఆర్ఎస్ లో చేరి.. తనను ఓడించేందుకు కుట్రలు చేశారని.. మండిపడ్డారు. ఆమె వ్యక్తిగత సంభాషణల గురించి చెప్పింది కాబట్టే తాను ఇలా చెప్పానన్నారు. తర్వాత భట్టి విక్రమార్క కూా మోసానికి మరోపేరు సబితా ఇంద్రారెడ్డి అని .. తన సీఎల్పీ పదవి పోవడానికి సబిత ఎలా కారణమైందో చెప్పారు.
Also read : ఆ రెండు స్కాములపైనా విచారణ.. హింట్ ఇచ్చిన రేవంత్
అయితే ఈ ఎపిసోడ్ తర్వాత మహిళా ఎమ్మెల్యేలు ఇద్దరూ కంట తడి పెట్టేందుకు రెడీ అయిపోయారు. రేవంత్ మహిళల్ని అవమానిస్తున్నారని.. తమను ఎందురు టార్గెట్ చేస్తున్నారని ప్రశ్నించారు. అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత మీడియా ముందు కూడా ఏడ్చారు. అసెంబ్లీ సమావేశాలను ఫాలో అయిన వాళ్లకు.. ఏముందని బీఆర్ఎస్ నేతలు అంత హడావుడి చేస్తున్నారని ఆశ్చర్యపోయారు.
బీఆర్ఎస్ ఏడుపుగొట్టు రాజకీయం వర్కవుట్ కాదని.. సజావుగా సాగిన అసెంబ్లీ సమావేశాలను రచ్చ చేసిన బ్యాడ్ నేమ్ మాత్రం బీఆర్ఎస్కు వస్తుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.