హైదరాబాద్: క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ హైదరాబాద్‌లో సందడి చేశారు. కావూరిహిల్స్‌లో ఉన్న ఇనార్బిట్ మాల్లో స్పోర్ట్స్ పార్క్‌ను ప్రారంభించారు. స్మాష్ అనే ఈ పార్క్‌లో బౌలింగ్ అల్లే, వీడియో గేమ్స్తోబాటు అనేక ఇండోర్ గేమ్స్‌ను ఏర్పాటు చేశారు. వీటితోబాటు సచిన్, వాసిమ్ అక్రమ్, డేల్ స్టేన్ వంటి క్రికెట్ దిగ్గజాలతో నేరుగా క్రికెట్ ఆడే అనుభవాన్ని కల్పించే సిమ్యులేటర్కూడా ఇక్కడ ఏర్పాటయింది. 42,000 చదరపు గజాల విస్తీర్ణంలో ఈ పార్క్‌ను ఏర్పాటు చేశారు. సచిన్‌ను చూడటానికి అభిమానులు పెద్దసంఖ్యలో ఎగబడ్డారు. హైదరాబాద్ నగరం అంటే తనకు ఇష్టమని, ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా బిర్యానీ తినకుండా వెళ్ళనని సచిన్ చెప్పారు. ఫలక్‌నూమా ప్యాలెస్ అద్భుతమైన కట్టడమని అన్నారు. సచిన్ ఈ పార్క్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు.