భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిత్ర దర్శకుడు సాగర్ చంద్ర ఓ ఆసక్తికరమైన విషయం పంచుకున్నారు. ”పంజా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఓ పాస్ దొరికింది. పాస్ జేబులో పెట్టుకొని పవన్ కళ్యాణ్ ని చూడొచ్చు కదాని చాలా హుషారుగా వెళ్ళా. కానీ అక్కడి వెళ్లి చూసేసరికి ఆయన్ని చూడ్డం అంత ఈజీ కాదని తెలిసింది. మూడు రెట్ల జనం వున్నారు. ఈవెంట్ నుంచి తోసిపడేశారు. అక్కడ నుంచి వచ్చిన నేను ఈ రోజు పవన్ కళ్యాణ్ సినిమాని డైరెక్ట్ చేశాను. నిజాంగా ఇదో అద్భుతమైన క్షణం” అని చెప్పుకొచ్చారు సాగర్ చంద్ర.
ఇదే వేడుకలో రానాపై ప్రసంసల వర్షం కురిపించారు సాగర్. ”దేవుడి నాకు మళ్ళీ జన్మనిచ్చి ఎవరిలా బ్రతుకుతావనే అవకాశం ఇస్తే.. ఖచ్చితంగా రానాలానే బ్రతుకుతాను. ఎలాంటి కండీషన్ లోనైనా ఫుల్ ఎనర్జీగా వుండే రానా అంటే నాకు అత్యంత ఇష్టం. బల్లాలదేవా.. భీమ్లా నాయక్ తో డానియల్ శేఖర్ గా గుర్తుండి పోతాడు” అన్నారు. ఇదే సందర్భంలో నిర్మాత నాగ వంశీ, చినబాబులకు ధన్యావాదాలు చెప్పిన సాగర్.. త్రివిక్రమ్ లేకపోతే ఈ సినిమా లేదని, భీమ్లా నాయక్ కి బ్యాక్ బోన్ తివిక్రమ్, ఆయన దగ్గర చాలా నేర్చుకున్నా., నా మనసులో ఆయనది గురుస్థానం” అని పేర్కొన్నాడు సాగర్ చంద్ర