హైదరాబాద్‌లో సొంత ఇల్లు ఉండాలనే కల నెరవేర్చుకోవడానికి మధ్య తరగతి ప్రజలకు ఎక్కువగా అందుబాటులో ఉన్న ప్రాంతం సాగర్ రింగ్ రోడ్. నాగార్జున సాగర్ రోడ్డు చుట్టుపక్కల ప్రాంతంలో అందుబాటు ధరలో ఫ్లాట్ల నిర్మాణం జరుగుతోంది. అపార్టుమెంట్లతోపాటు ఇండిపెండెంట్ హౌస్‌లు , విల్లాలూ లభిస్తున్నాయి. తక్కువ ఖర్చులో సొంతిల్లు ఉండాలని కోరుకునేవారికి మంచిఆప్షన్ లా ఉంది.
బీఎన్ రెడ్డి నగర్, తుర్కయంజాల్, మన్నెగూడ, బొంగుళూరు, శేరిగూడ, ఇబ్రహీంపట్నం వరకు కాలనీలు ఏర్పడ్డాయి. కాలనీలు విస్తరిస్తున్నాయి. దూరాన్ని బట్టి ఇరవై వేల నుంచి యాభై వేల రూపాయల వరకూ గజం ధర పలుకుతోంది. బీఎన్ రెడ్డి నగర్, తుర్కయంజాల్ లో లో ఎక్కువగా ఇండిపెండెంట్ ఇళ్లు, అపార్టుమెంట్లను బిల్డర్లు నిర్మిస్తున్నారు. ఎల్బీ నగర్ లో డబుల్ బెడ్రూం ఫ్లాట్ కొనాంటే సుమారు 80 నుంచి 90 లక్షల రూపాయలు అవుతుంది. సాగర్ రింగ్ రోడ్డుకు కాస్త దూరంలో అల్మాస్ గూడ, ఇంజాపూర్, తుర్కయంజాల్ వంటి ప్రాంతాల్లో డబుల్ బెడ్రూం ఫ్లాట్ 50 లక్షలకేవస్తోంది.
బొంగ్లూరుకు సమీపంలో అయితే 40 లక్షల రూపాయల నుంచి అపార్టుమెంట్లు లభిస్తున్నాయి. ఇండిపెండెంట్ ఇళ్లయితే.. రూ. 60 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి. ఓపెన్ ప్లాట్లు సైతం చదరపు గజం 15 వేలకు లభిస్తున్నాయి. సాగర్ రింగ్ రోడ్డు సమీపంలోనే దిలుసుఖ్ నగర్, ఎల్బీ నగర్, వనస్థలీపురం, హయత్ నగర్ ఉన్నాయి. నాగార్జున సాగర్ కు వెళ్లే రహదారితో పాటు ఔటర్ రింగ్ రోడ్డు ఉండటంతో కనెక్టివిటీ అందరికి అందుబాటులో ఉంటుంది. స్థిరంగా ఆస్తుల విలువ పెరుగుదల ఉంటుంది. అందుకే ఇప్పుడు ఎక్కువ మంది మధ్యతరగతి ఆప్షన్‌గా సాగర్ రోడ్ ఉందని అనుకోవచ్చు.