సాయిధరమ్ తేజ్‌కి మళ్ళీ సోలో రిలీజ్ డేట్ దొరికేట్టు కనిపించడం లేదు. ‘ఇంటిలిజెంట్’ను మంచు ఫ్యామిలీ ‘గాయత్రి’తో విడుదల చేశాడు. తర్వాతి రోజు మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ ‘తొలిప్రేమ’ విడుదలైంది. ముక్కోణపు పోటీలో ప్లాప్ టాక్ వచ్చిన సాయిధరమ్ తేజ్ చిత్రం చతికిలబడింది. ఒకవేళ సోలోగా వచ్చి వుంటే మినిమమ్ కలెక్షన్స్ వచ్చేవేమో. ‘ఇంటిలిజెంట్’ ఫలితాన్ని పక్కనబెట్టి కరుణాకరన్ దర్శకత్వంలో క్రియేటివ్ కమర్షియల్స్ కె.ఎస్. రామారావు నిర్మిస్తున్న సినిమాపై కాన్సంట్రేట్ చేశాడు. ఈ చిత్రానికీ సోలో రిలీజ్ డేట్ కుదరడం లేదు. జూన్ 14న చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్‌లో వున్నారు. ఇంకా అనౌన్స్ చేయలేదు. ఆల్రెడీ సేమ్ డేట్‌కి ‘లవర్’ను రిలీజ్ చేస్తున్నట్టు దిల్ రాజు అనౌన్స్ చేశాడు. రాజ్ తరుణ్ హీరోగా ‘అలా ఎలా?’ ఫేమ్ అనీష్ కృష్ణ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తున్న చిత్రం ‘లవర్’. సో.. పోటీ నుంచి తీసిపారేయదగ్గ చిత్రం అయితే కాదు. వర్షాకాలం ప్రారంభంలో రాజ్ తరుణ్ vs సాయిధరమ్ తేజ్ పోటీలో ఇద్దరూ విజేతలుగా నిలుస్తారో? ఒక్కరే విజేతగా నిలుస్తారో?