మెగాస్టార్ చిరంజీవిది చాలా సున్నిత మనస్తత్వం. అప్పటికి ఇప్పటికీ ఆయన చాలా మృదు స్వభావి. తోటి నటులతో ఆయన ఎంతో సున్నితంగా వ్యవహరిస్తారు. వివాదాలకు దూరం. ఎవరి స్వభావం అయిన నచ్చకపొతే ఆయనే సున్నితంగా తప్పుకుంటారు తప్పితే బహిరంగా విమర్శించి ఎదో గొప్ప అయిపోదాం అనే మనస్త్వం కాదు. తెలుగు సినిమా వజ్రోత్సవాల్లో జరిగినప్పుడు మోహన్ బాబు ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ ఎక్సైటయ్యాడే గానీ చిరు మాత్రం ఆ వివాదాన్ని చాలా సున్నితంగా ముగించేశారు. రాజకీయాల్లో కూడా అంతే ఎప్పుడూ కటువుగా వ్యవహరించలేదు. అందరివాడిలానే వున్నారు.
ఇప్పుడు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా ఈ విషయంలో పెద మావయ్యాను ఫాలో అవుతున్నాడనిపిస్తుంది. హీరోలు,గ్రూపులు, వర్గాలు ఫాలోయింగులు అనే లెక్కలు వేయకుండా అందరితోనూ సఖ్యతగా వుండాలని భావిస్తున్నాడు సాయి. సహజంగానే అందరితో కలిసిపోయే స్వభావం వున్న తేజు.. ఈ హీరో ఆ హీరో అనే తేడా లేకుండా అందరితోనూ స్నేహంగా వుంటున్నాడు. ఏ హీరో వేడుకలకైనా ఎలాంటి భేషజం లేకుండా హాజరౌతాడు సాయి. బాలకృష్ణ వందో సినిమా వస్తే.. దానికి మనస్పూర్తిగా అభినంధించాడు. మొన్న మనోజ్ ఆడియో ఫంక్షన్ లో మంచు ఫ్యామిలీతో కలసిపోయాడు. నిన్న తన కొత్త సినిమా ‘జవాన్’ఓపెనింగ్ కు ఎన్టీఆర్ వచ్చి క్లాప్ కొట్టడం అందరినీ ఆకట్టుకుంది. అలాగే తాజా సినిమా ‘విన్నర్’ సినిమా ట్రైలర్ ను మహేష్ బాబుతో రిలీజ్ చేయాలని భావిస్తున్నాడు తేజు. మొత్తంమ్మీద ఇలా అందరితోనూ కలవిడిగా వుంటూ ముందుకు సాగాలనే తేజు ఆలోచన అభినందనీయమే. ఈ విషయంలో మెగాస్టార్ అడుగుజాడల్లో నడుస్తున్నాడు తేజు.