సాయిధరమ్ తేజ్ – సంపత్‌నంది కాంబినేషన్లో ‘గాంజా శంకర్’ పట్టాలెక్కుతుందని ఇది వరకే వార్తలొచ్చాయి. చిన్న గ్లింప్స్ కూడా వదిలారు. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. టైటిల్, కాంబోతోనే ఈ ప్రాజెక్ట్ పై ఆసక్తి పెరిగింది. సంపత్ నందికి మాస్ పల్స్ బాగా తెలుసు. తేజ్ కూడా పూర్తి మాస్ సినిమా చేసి చాలాకాలం అయ్యింది. అందుకే… చిన్న ప్రకటనతోనే హైప్ పెరిగింది.
అయితే మధ్యలో తేజ్ ఈ ప్రాజెక్ట్ నుంచి బయటకు వెళ్లాడని, బడ్జెట్ దాటడం వల్ల నిర్మాణ సంస్థ ఈ సినిమాని పక్కన పెట్టిందని వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు ఆ సర్దుబాట్లన్నీ ఓ కొలిక్కి వచ్చాయి. సేమ్ కాంబినేషన్ లో.. తేజ్ తోనే ముందుకు వెళ్లనుంది. మార్చి 1 లేదా 4 నుంచి షూటింగ్ ప్రారంభించడానికి చిత్రబృందం సన్నాహాలు మొదలెట్టింది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ‘విరూపాక్ష’లో కాస్త బొద్దుగా కనిపించాడు తేజ్. ఈ సినిమా కోసం కాస్త బరువు తగ్గనున్నాడు. ‘విరూపాక్ష’లాంటి సూపర్ హిట్ తరవాత.. తేజ్ నటిస్తున్న సినిమా ఇదే.