పిల్లానువ్వులేని జీవితం, సుబ్రమణ్యం ఫర్‌సేల్, సుప్రీమ్… ఇలా వరుస హిట్లతో హ్యాట్రిక్ హీరో అనిపించుకొన్నాడు సాయి ధరమ్ తేజ్. సుప్రీమ్‌తో మాస్‌కి మరింత దగ్గరయ్యాడు. ఈ సినిమా దాదాపుగా రూ.22 కోట్లు వసూలు చేసింది. దాంతో సాయిధరమ్ రేంజూ పెరిగింది. తొలి మూడు సినిమాలు దిల్‌రాజు బ్యానర్లోనే చేశాడు. దిల్‌రాజు ఒకేసారి మూడు సినిమాలకు సరిపడా ఎగ్రిమెంట్లు రాయించుకొన్నాడు. ఆయా చిత్రాలకు సాయిధరమ్‌కి పెద్దగా పారితోషికం దక్కలేదు. తిక్కకి పారితోషికం తీసుకొన్నా అది నామమాత్రమే అట. ఈసారి మాత్రం సాయిధరమ్ ఏకంగా రూ.3 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట. సాయి అడిగినంత ఇవ్వడానికీ నిర్మాతలు రెడీగానే ఉన్నారు.
హిట్లని బట్టే డిమాండ్.. డిమాండ్‌ని బట్టే క్యాష్! ఈ సూత్రాని సాయి బాగానే అర్థం చేసుకొన్నాడు. బీ,సీ సెంటర్లోల సాయిధరమ్కున్న క్రేజ్ చూసి మూడు కోట్లు ఇవ్వడం తప్పులేదని నిర్మాతలు భావిస్తున్నారు. తిక్క గనుక హిట్టయితే.. సాయి రూ.5 కోట్లు అడిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయితే సాయిధరమ్ మాత్రం… ”పారితోషికం విషయంలో నాకెలాంటి పట్టింపులూ లేవు. నాకెంత ఇవ్వాలో నిర్మాతలకు తెలుసు. నేనేం ప్రత్యేకంగా డిమాండ్ చేయాల్సిన పనిలేదు” అంటున్నాడు.