‘ఇంటెలిజెంట్’ రిజల్ట్ నుంచి మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ త్వరగా బయటపడ్డాడు. సినిమా విడుదలైన తర్వాత తేజూ ఎక్కడా కనిపించలేదు. సోషల్ మీడియాలోనూ సైలెంట్ అయ్యాడు. పది రోజుల్లో అతడి పరిస్థితి సాధారణ స్థితికి వచ్చింది. ఈ రోజు (సోమవారం) నుంచి కరుణాకరన్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా షూటింగులో పాల్గొంటున్నాడు. క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.ఎస్. రామారావు నిర్మిస్తున్న ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్. ఆదివారం రాత్రి యూనిట్ సభ్యుల సమక్షంలో జరిగిన ఆమె బర్త్ డే సెలబ్రేషన్స్‌కి తేజూ అటెండ్ అయ్యాడు. అలాగే, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటించే సినిమా గురించి కూడా ఆదివారం అనౌన్స్ చేయించాడు. ఆ సినిమా షూటింగ్ మేలో మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈలోపు కరుణాకరన్ సినిమా షూటింగ్ కంప్లీట్ చేయడానికి తేజూ ప్లాన్ చేస్తున్నాడు. ఏప్రిల్ నెలాఖరుకి కరుణాకరన్ సినిమా షూటింగ్ పూర్తవుతుందని సమాచారం.