సాయిధరమ్ తేజ్ హీరోగా కరుణాకరన్ దర్శకత్వంలో క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కెఎస్ రామారావు నిర్మిస్తున్న సినిమాకు ‘అందమైన చందమామ’ టైటిల్ ఖరారు చేసినట్టు వార్తలు వచ్చాయి. వీటిని చిత్రబృందం ఖండించింది. అయితే… అసలు టైటిల్ ఏంటనేది మాత్రం చెప్పలేదు. ట్విట్టర్లో సాయిధరమ్ తేజ్ సైతం “టైటిల్ గురించి వచ్చిన వార్తల్లో నిజం లేదు. సినిమాకి ఇంకా ఎలాంటి టైటిల్ ఫైనలైజ్ చేయలేదు” అన్నారు.
తెలుగు360కి అందిన ఎక్స్‌క్లూజివ్ సమాచారం ప్రకారం… సినిమాకి ‘తేజ్’ టైటిల్‌ని ఖరారు చేశారు. ‘ఐ లవ్ యు’ అనేది ట్యాగ్‌లైన్. సాధారణంగా దర్శకుడు వీవీ వినాయక్ తన సినిమాల్లో హీరోలకు ఒరిజినల్ పేర్లును పెడుతుంటారు. దర్శకుడు కరుణాకరన్ హీరో పేరుని సినిమా టైటిల్‌గా ఖరారు చేశారు. ‘తొలిప్రేమ’తో పవన్ కల్యాణ్‌కి కెరీర్లో మధురమైన విజయం అందించిన కరుణాకరన్, మేనల్లుడు తేజ్‌కి కూడా అటువంటి విజయాన్ని అందిస్తాడని చిత్రబృందం చెబుతోంది. అందరమైన ప్రేమకథతో, తనదైన శైలిలో కరుణాకరన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారట. ఇందులో తేజ్ సరసన అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తోంది.