చిరంజీవి తన ఫ్యామిలీ విషయంలో చాలా కేర్‌గా ఉంటారు. మెగా కుటుంబం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ సక్సెస్ కావాలని ఆయన ఆశ. చరణ్ విషయంలో ఈ జాగ్రత్తలు మరింత ఎక్కువగా ఉంటాయి. కథ దగ్గర్నుంచి, విడుదల తేదీ ఎప్పుడన్న విషయం వరకూ ప్రతీ విషయం తనకు తెలియకుండా జరగదు. ఇప్పుడు కొత్తగా అల్లుడి బాధ్యత కూడా నెత్తిమీద పడింది. అయితే.. సాయిధరమ్ తేజ్‌ని మాత్రం పట్టించుకోవడం లేదేమో అనిపిస్తోంది. మేనల్లుడికి వరుసగా ఫ్లాపులు వస్తున్నాయి. దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. తాజాగా `తేజ్` కూడా బాగా నిరాశ పరిచింది. పెద్ద దర్శకులు, పెద్ద బ్యానర్లతో పని చేస్తున్నా తేజ్‌కి హిట్టు దక్కడం లేదు. కథల జడ్జిమెంట్ విషయంలో అతని అంచనాలు తప్పుతున్నాయి. చిరంజీవికి కథలు జడ్జ్ చేయడంలో చాలా అనుభవం ఉంది. ఆయన కథ విని `బాగుంది.. ప్రొసీడ్` అంటే ఆ సినిమా హిట్టుకిందే లెక్క. ఈ విషయాన్ని రాజమౌళి లాంటివాడే చెప్పాడు. అబ్బాయి, అల్లుడు చేస్తున్న సినిమా కథలు వింటున్న చిరు… మేనల్లుడు తేజ్ కథలపై దృష్టి పెడితే బాగుంటుంది. చిరు పోలికలు.. సాయిధరమ్ తేజ్‌లో ఎక్కువగా కనిపిస్తాయి. చిరు పాటల్ని కూడా రీమిక్స్ చేసి అభిమానుల్ని అలరిస్తూ వచ్చాడు. మొదట్నుంచి చిరు సపోర్ట్ తేజ్‌కి బాగానేఉంది. కాకపోతే.. ఈ కథల విషయంలోనూ కొన్ని సలహాలిస్తే.. తేజూ మళ్లీ నిలదొక్కుకుంటాడు.