ఇంతకీ ఏ తేజూ… రామ్‌చరణ్ తేజ్కా? వరుణ్ తేజ్కా? వైష్ణవ్ తేజ్కా…. ఆ ఒక్క పేరు తప్ప అన్ని పేర్లనూ వరుసగా ఊహించేసుకోకండి. ఆ తేజ్ సాయిధరమ్‌తేజ్. పాపం.. వ్యాలెంటైన్ వీక్ అప్పుడే వచ్చిందని తెగ ఇదై పోతున్నాడు. దీని గురించి ట్విట్టర్లో చాలా విషయాలనే షేర్ చేసుకున్నాడు.
`1999 సింగిలే.. 2009లో ఎహే సింగిలే.. 2019లో అయినా కానీ సింగిలే సింగిలే..` అంటూ తన సింగిల్ స్టోరీ చెప్పుకొచ్చాడు. అంతేకాదు సింగిల్స్ అందరికీ తలా ఒక ప్రౌడ్ స్టోరీ ఉంటుందని, సింగిల్స్ అందరూ కలిసి సింగిల్స్ వేలంటైన్స్ డే జరుపుకుందామని ప్రోత్సహిస్తున్నాడు. అంతటితో ఊరుకోవడం లేదు.. సింగిల్స్ స్టోరీస్ ని `ఎస్డీటీ సింగిల్ చాలెంజ్ హ్యాష్‌ట్యాగ్‌తో జతచేయమని చెప్పాడు. అంతే కాదు ఎవ్రీ సింగిల్ హాజ్ ఎ స్టోరీ అని చివరిగా రాసుకొచ్చాడు. మెదడులో ఆలోచన రావాలేగానీ, ఫ్యాన్స్ ని ఎంగేజ్ చేయడంలో హీరోలు ఒకరిని ఒకరు మించి పోతున్నారబ్బా అని నెటిజన్లు సరదాగా కామెంట్ చేస్తున్నారు.