తెలుగు సినిమా డైరెక్టర్‌గా సెటిల్ అయిన తమిళోడు కరుణాకరన్. ‘తొలిప్రేమ’తో డైరెక్టర్‌గా ఇంట్రడ్యూస్ అయ్యి ఇరవై ఏళ్లలో పదంటే పది సినిమాలు మాత్రమే చేశాడు. త్వరలో విడుదల కానున్న సాయిధరమ్ తేజ్ ‘తేజ్’ సినిమాతో కలుపుకుంటే. కరుణాకరన్ కెరీర్లో హిట్స్ వున్నాయి. ప్లాప్స్ వున్నాయి. అయితే… హీరో ఎవరైనా ప్రతి సినిమాలో తన మార్క్ వుంటూ చూసుకున్నాడు. కథ కంటే లిటిల్ క్యూట్ అండ్ బ్యూటిఫుల్ మూమెంట్స్ మీద కాన్సంట్రేట్ చేస్తాడు. లవ్ మాంటేజ్ బిట్స్‌ని అందంగా చూపించడం కరుణాకరన్ స్పెషాలిటీ. లేటెస్ట్గా రిలీజైన ‘తేజ్’ టీజర్లోనూ అది స్పష్టంగా కనిపించింది. సాయిధరమ్ తేజ్, అనుపమా పరమేశ్వరన్ జంటగా క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కెఎస్ రామారావు నిర్మిస్తున్న సినిమా ‘తేజ్’. ఐలవ్ యూ.. అనేది కాప్షన్. ఈ రోజు టీజర్‌ని రిలీజ్ చేశారు. అందులో ఒక్క డైలాగ్ లేదు. కానీ, బాగుంది. మ్యూజిక్, మేకింగ్ ‘డార్లింగ్’ సినిమాను గుర్తుకు తెచ్చినా… రెగ్యులర్ సాయిధరమ్ తేజ్ సినిమాలకు భిన్నంగా వుంది. సినిమా ఎలా వుంటుందో?