రెండున్నర గంటల నిడివిగల సినిమాలు తీయడం విషయం తర్వాత కానీ మన తెలుగులో ఉన్న చాలా మంది డైరెక్టర్స్‌కి టీజర్, టైలర్ కట్ చేయడం, చేయించుకోవడం కూడా రావడం లేదు. రీసెంట్గా నానీ నటించిన ‘నేను లోకల్’ ట్రైలర్ రిలీజ్ అయింది. ఆ ట్రైలర్లో కనిపించిన నానీ యాటిట్యూడ్, డైలాగ్స్, విజువల్స్ ఏవీ కూడా మనకు కొత్తకాదు. కానీ కొత్తగా అనిపించడం కోసం చాలా చాలా ట్రై చేశారు. అంత రొటీన్ స్టఫ్ ఉన్న ఓ సినిమా ట్రైలర్‌ని ఆ రేంజ్లో రూపొందించడం అంటే మామూలు విషయం కాదు. కానీ నానీ, దిల్ రాజు, డైరెక్టర్ త్రినాథ్‌లు ఆ మేజిక్ చేశారు.
ఈ టైంలోనే సాయిధరమ్ తేజ్ నటిస్తున్న ‘విన్నర్’ మూవీ టీజర్ రిలీజ్ అయింది. అనసూయను చూపించిన షాట్ ఒకె. ఇక సినిమాలో ఉన్న పృథ్వీ, అలీ, జగపతిబాబులు కనిపించినప్పుడు మాత్రం ఈ ‘విన్నర్’ ఎంత రొటీన్‌గా ఉండబోతున్నాడో తెలిసిపోతూ ఉంది. సాయి ధరమ్ తేజ్ నోటి నుంచి వచ్చిన డైలాగులు ఏంటి అనే విషయం కూడా అర్థం కాకుండా థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఉంది. అసలు టీజర్ మొత్తాన్నికూడా థమన్ మ్యూజిక్కే డామినేట్ చేసింది. కనీసం అదైనా కొత్తగా ఉందా అంటే గతంలో వచ్చిన థమన్ సినిమాల నుంచి థమనే కాపీ కొట్టుకున్నట్టుగా ఉంది. ఓవరాల్‌గా చూస్తే టీజర్లో ఉన్న పాజిటివ్ విషయం ఒక్కటే. సాయిధరమ్ తేజ్. తేజ్ స్టైలింగ్, ఎనర్టీ, లుక్….అన్నీ కూడా ఫ్యాన్స్‌కి బాగా నచ్చుతాయనడంలో సందేహం లేదు. మరి ఫ్యాన్స్ కాని వాళ్ళ కోసం ఏంటి అంటే మాత్రం టీజర్లో ఏమీ లేదు. రాబోయే ట్రైలర్‌తోనైనా ఏదైనా మేజిక్ చేస్తారేమో చూడాలి మరి.