‘విరూపాక్ష’ తరవాత… ఓ మాస్ సినిమా చేయాలని ఫిక్సయ్యాడు సాయి ధరమ్ తేజ్. ఈ చిత్రానికి సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. ‘గాంజా శంకర్’ అనే మాస్ టైటిల్ ఈ సినిమా కోసం ఫిక్స్ చేశారు. పూజా హెగ్డే ఓ కథానాయిక. మరో కథానాయికకీ ఛాన్స్ వుంది. సెప్టెంబరు నెలాఖరు నుంచి షూటింగ్ మొదలెడతారు. ప్రస్తుతం గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. ‘ధమాకా’ లాంటి సూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చిన భీమ్స్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. భీమ్స్కీ, సంపత్కీ మంచి రాపో ఉంది. ‘పేపర్ బోయ్’, ‘బెంగాల్ టైగర్’ చిత్రాలకు తనే సంగీతం అందించారు. ఇప్పుడు ఈ కాంబో మరోసారి సెట్టయ్యింది. ‘బ్రో’ తరవాత తేజ్ కాస్త గ్యాప్ తీసుకొన్నాడు. అక్టోబరు, నవంబరులో ఆయన ‘గాంజా శంకర్’ షూటింగ్ లో పాల్గొంటాడు. ఈలోగా.. తేజ్ లేని సన్నివేశాల్ని పూర్తి చేస్తారు సంపత్ నంది. సంపత్‌కి మాస్ పల్స్ బాగా తెలుసు. పైగా చాలా ఫాస్ట్‌గా, అదే సమయంలో క్వాలిటీతో సినిమాలు తీస్తాడాయన. 2024 వేసవి రేసులోకి ‘గాంజా శంకర్’ని తీసుకురావాలన్నది టీమ్ ప్రయత్నం.